ప్రియమణికి ఆ హీరో కారు గిప్ట్?
ప్రియమణి ప్రేమలో పడిందని ఆమెకు ఆమె బాయ్ ప్రెండ్ అయిన తరుణ్ కారు గిఫ్ట్ ఇచ్చారనే వార్త అంతటా వినపడుతోంది. ఇదే విషయమై మీడియా ఆమెను ప్రశ్నించినప్పుడు తామిద్దరూ కలిసి 'నవవసంతం' చిత్రంలో నటించే సమయంలోనే పరిచయమయ్యమనీ తరుణ్ తనకు మంచి ఫ్రెండ్ మాత్రమేననీ, ఆ సినిమా తర్వాత తాము కలవలేదని చెబుతోంది. అయితే తరుచుగా వీళ్ళిద్దరూ ఫైవ్ స్టార్ రెస్టారెంట్లలో కనిపించడం జరుగుతోందని, ఫ్రెండ్స్ రహస్యంగా లవర్స్ లా అక్కడక్కడా కలవాల్సిన పని ఏమిటి అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే తమిళ మీడియా సైతం ఈ ప్రేమ వ్యవహారం పై వార్తా కథనాలు ప్రచురిస్తోంది. తరుణ్ ఇటీవల ఓ ఖరీదైన కారును ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చాడనీ, తరుణ్ తల్లి రోజారమణి సైతం వీరి వ్యవహారం తన దృష్టిలో పడటంతో వివాహానికి సుముఖంగానే ఉందనీ ఆ వర్గాల కథనం. ప్రస్తుతం ప్రియమణి తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్ లను పూర్తి చేసే పనిలో ఉందనీ, ఆ తర్వాతే లవర్ బాయ్ తరుణ్ ను కొంగున ముడేసుకుంటుందనీ అంటున్నారు. ఇంతకీ తరుణ్ మనస్సులో ఏముందో..ఆర్తి అగర్వాల్ కి హ్యాండు ఇచ్చినట్లే ప్రియమణీ బలవుతుందా లేక...అనేది తేలాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











