టాక్సీవాలా బ్యూటీకి వరుసగా ఆఫర్స్
విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన టాక్సీవాలా చిత్రంలో మెరిసింది ప్రియాంక జవాల్కర్. అయితే చేసిన మొదటి చిత్రమే భారీ హిట్ కొట్టినా రెండో అవకాశం మాత్రం అంత సులభంగా రాలేదు. సోషల్ మీడియాలో అడపదడపా పోస్ట్స్ పెడుతూ హల్ చల్ చేసిన ప్రియాంకకు తాజాగా కొన్ని ఆఫర్స్ వచ్చినట్టు తెలుస్తోంది.
తెలుగు హీరోయిన్ అయిన ప్రియాంకకు మొదటి అవకాశంగా విజయ్ దేవరకొండ లాంటి హీరో పక్కన రావడం విశేషం. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, ఆన్‌లైన్‌లో మొత్తం సినిమా లీకైనప్పటికీ టాక్సీవాలా ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ మూవీ విజయంలో ప్రియాంక జవాలక్కర్‌కు కూడా పేరు వచ్చింది. అయితే ఈ సినిమా వచ్చిన చాలా రోజులకి ప్రియాంకకు రెండో అవకాశం వచ్చింది.

ప్రియాంక చేతిలో ప్రస్తుతం రెండు అవకాశాలున్నాయి. 'రాజావారు రాణిగారు' సినిమాతో హీరో అనిపించుకున్న కిరణ్, మరో సినిమా చేయడానికి రంగంలోకి దిగాడు. ఈ సినిమాలో కథానాయికగా ప్రియాంక జవల్కర్ ఎంపికైనట్టు టాక్. ఇక శివ కందుకూరి హీరోగా దర్శకురాలు సుజన ఒక సినిమాను రూపొందించనుంది. ఈ సినిమాలో ఆయనకు జోడీగా ప్రియాంకను తీసుకుంది. ఈ రెండు విజయాన్ని సాధిస్తే ప్రియాంక కెరియర్ ఊపందుకునే అవకాశాలు వున్నాయి.


Click it and Unblock the Notifications











