చిరంజీవి అల్లుడు రెచ్చగొట్టి 'తీన్ మార్'చిత్రానికి లీగల్ నోటీస్!?

By Srikanya

పవన్, త్రిష కాంబినేషన్ లో రూపొందిన తీన్ మార్ చిత్రం త్వరలో లీగల్ సమస్యలను ఎదుర్కోనుందని సమాచారం. ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్నదాని ప్రకారం ఈ చిత్రంలో లిప్ టు లిప్ కిస్ సీన్ కి సెన్సార్ అభ్యంతరం పెట్టింది. ఆ సీన్ తీసేయమని యు సర్టిఫికేట్ జారిచేసింది. అయితే నిర్మాత, దర్శకుడు దానని పట్టించుకోకుండా విడుదల చేసారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయమై అస్సలు ఆసక్తి చూపలేదు. దాంతో కొందరు సెన్సార్ మెంబర్స్ గురువారం దానిని చూసి కంప్లైంట్ చేసారు. మరో ప్రక్క చిన్న నిర్మాతల మండలి నుండి కూడా ఈ సినిమాకి ఎలా యు సర్టిఫికేట్ ఇస్తారంటూ తలనొప్పి వచ్చింది. అడల్ట్ కంటెంట్ ఉన్నప్పుడు దాన్ని పట్టించుకోకుండా తమకిష్టమైన సర్టిఫికేట్ ఇచ్చారని అన్నారు.

అంతేగాక చిన్న సినిమాలకు ఒక రకంగా, పెద్ద సినిమాలకు మరో రకంగా సెన్సార్ జరుగుతోందని కామెంట్స్ చేసారు. అయితే కంప్లైంట్ చేసిన సెన్సార్ సభ్యుల వెనక, చిన్న నిర్మాతల వెనక ఓ వ్యక్తి ఉన్నాడని, అతనెవరో కాదని చిరంజీవి చన్నల్లుడు అని అంటున్నారు. గత కొద్దిరోజులగా చిరంజీవి కుటుంబానికి, అతనికీ మధ్య వివాదం జరుగుతోంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే అతనలా అందరినీ రెచ్చగొడుతున్నాడని, లీగల్ నోటీస్ పంపాల్సిందేనని పట్టుబడుతున్నాడని తెలుస్తోంది. వీరికి లోకల్ గా ఉన్న ఓ యంగ్ ఎమ్మల్యే కూడా సాయిం చేస్తున్నాడని అంటున్నారు. అసలే తీన్ మార్ కలెక్షన్స్ డ్రాప్ అయిపోతున్న ఈ దిసలో తమ సొంత ఇంటి నుంచే మొదలైన ముసలం ఎక్కడికి దారితీస్తుందో అని ఎవరూ ఈ విషయంపై తల దూర్చటం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X