ప్లాప్ డైరెక్టర్ త్యాగం చేయటంతో పవన్ కళ్యాణ్ సేఫ్..
గోపిచంద్ 'వాంటెడ్" చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమై..ప్లాప్ దర్శకుడిగా ముద్ర వేయించుకున్న బి.వి.యస్.రవి తన దర్శకత్వంలో రూపొందే సినిమాకి 'తీన్ మార్" అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించుకున్నాడని వినికిడి. కాగా జయంత్ దర్శకత్వంలో 'లవ్ ఆజ్ కల్" రీమేక్ గా పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా కామెడీ యాక్టర్, నటుడు గణేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'తీన్ మార్" టైటిల్ డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. అయితే మొదట ఈ చిత్రానికి ఖుషీగా అని తర్వాత లవ్లీ అనీ వర్కింగ్ టైటిల్స్ గా షూటింగ్స్ జరిగిన విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ అంటే తనకున్న ఇష్టం వల్ల, మిరపకాయ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తనకు ఫ్రెడ్స్ షిప్ వల్ల, ఆ టైటిల్ ను వారు తస్కరింపబడినా కూడా బి.వి.యస్.రవి ఈ టైటిల్ ను త్యాగం చేశాడని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ త్యాగం చేయకపోయి ఉండి ఉంటే..ఖలేజా, కత్తి టైటిల్స్ లా 'తీన్ మార్" కూడా వివాదం అయ్యుండేది..


Click it and Unblock the Notifications











