'రచ్చ'ని ఉద్దేశించే డైరక్టర్ తేజ కామెంట్?

By Srikanya

'ఈ రోజుల్లో' తర్వాత మార్కెట్లో మంచి సినిమా ఏదీ లేదు. అందుకే ఇది సరైన టైమ్ అని విడుదల చేస్తున్నాం అంటూ దర్శకుడు తేజ తన తాజా చిత్రం ప్రమోషన్ లో భాగంగా అన్నమాట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 'ఈ రోజుల్లో'తో పాటు నా ఇష్టం విడుదలైంది. అలగే క్రిందటి వారం రామ్ చరణ్ రచ్చ చిత్రం విడుదలైంది. అయితే తేజ డైరక్ట్ గా 'ఈ రోజుల్లో' తర్వాత మార్కెట్లో మంచి సినిమా ఏదీ లేదు అని స్టేట్ మెంట్ ఇచ్చేసారు. అంటే రచ్చని ఆయన కావాలనే అన్నారా అనే సందేహాలు కలుగుతున్నాయని అంటున్నారు.

నిజానికి రచ్చ లాంటి పెద్ద చిత్రాన్ని పట్టించుకోకుండా ఉండటం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి అసాధ్యం.. అందుకే తేజ కామెంట్ కి అనుమానపడుతున్నారు. ఇక ఆ మధ్యన రామ్ చరణ్ కి తేజ కథ చెప్పటానకి ట్రై చేసాడని,అయితే ఎవరూ ఆసక్తి చూపలేదని అందుకే ఇలా ప్రస్టేషన్ లో అంటున్నాడని చెప్తున్నారు.

దానికి తోడు స్టార్స్ ని ఉద్దేశిస్తూ... స్టార్స్‌ని నేను హేండిల్ చేయలేను. వాళ్ల ఇమేజ్ కోసం స్క్రిప్ట్‌లో కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. ఇమేజ్‌ని లెక్కలోకి తీసుకోకుండా చేస్తే వాళ్లతో పాటు అభిమానులూ ఒప్పుకోరు. అలా స్టార్ కోసం నేను స్క్రిప్ట్ మార్చలేను. అందుకే ఇప్పటికైతే స్టార్స్‌తో చెయ్యకూడదనే అనుకుంటున్నా. నేను నిజాయితీగా ఉంటా. ఉన్న విషయం మాట్లాడతా అన్నారు. ఆ మధ్యన వెంకటేష్ తో రెండేళ్లు కష్టపడి సావిత్రి అనే స్క్రిప్టుని రెడీ చేసుకుని ఓకే చేయించుకున్నారు. వైజాగ్ స్టూడియోలో దాని ఓపినింగ్ కూడా జరిగింది. అయితే అనుకోని విధంగా సురేష్ బాబు ఆ ప్రాజెక్టుని ఆపు చేసేసారు. దాంతో విసిగిపోయిన తేజ ఇలా మాట్లాడుతున్నాడని చెప్తున్నారు.

అలాగే తన తాజా చిత్రం గురించి చెపుతూ...నాలుగేళ్ల తర్వాత నానుంచి ఈ సినిమా వస్తుంటే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉందోలేదో తెలీదుకానీ, నాకు మాత్రం ఈ సినిమాని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఆసక్తీ, టెన్షన్ ఉన్నాయి. సినిమా చాలా బాగా వచ్చింది. ఇదంతా నా తెలివి వల్లే వచ్చిందనుకుంటే తప్పు. నిజంగా నా తెలివి వల్లే వచ్చుంటే మధ్యలో ఫ్లాపులు ఇచ్చేవాణ్ణి కాదు. నేను స్టార్స్ కోసం చూడను. కొత్తవాళ్లతో సినిమా చేయడమే నాకు సుఖం అని తేల్చి చెప్పారు.

నూతన తారలు ప్రిన్స్, నందిత జంటగా రూపొందిన 'నీకు నాకు డాష్ డాష్'కు తేజ దర్శకుడు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మించిన ఆ చిత్రం ఈ నెల 13న విడుదలవుతోంది. 'నీకు నాకు డాష్ డాష్' అంటే రకరకాలుగా ఊహించుకుంటున్నారు. ఇందులో రక్తపాతం, బూతులు ఉండవు. 'డాష్' అనేది హీరోయిన్ ఊతపదం. ఇది లవ్‌స్టోరీ మేళవించిన థ్రిల్లర్. శుభంకార్డు పడే రెండు నిమిషాల ముందు కూడా ఓ మలుపు వస్తుంది. ఏమాత్రం ఊహించని ఆ మలుపుకు ప్రేక్షకులు థ్రిల్‌కు గురవుతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X