తేజ...వర్మ అనుకుంటున్నాడా?

By Staff

Teja
తేజ తాజాగా రూపొందించిన కేక చిత్రం ఆడియా మొత్తానికి రిలీజ్ అయ్యింది. సినిమా రిలీజ్ కి ముందే ఒక్కోపాటను ఒక్కో ఎఫ్.ఎం.రేడియా ఛానెల్ ద్వారా విడుదల చేస్తానన్న ఆయన చక్రి పట్టుదలతో వెనక్కి తగ్గి తాజ్ దక్కన్ లో ఈ ఫంక్షన్ జరిపారు. ఆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...తన ప్రవర్తన తిక్కగా ఉంటుందని, కేతిరెడ్డి జగదీష్ రెడ్డి తనకు బ్యాక్‌బోన్ అని, తన వెన్నంటి ఉంటూ తాను చేసే పిచ్చిపనులను సరిదిద్దుతుంటాడని తెలిపారు.

పబ్లిసిటీ వారిని కూడా హింసపెట్టానని, అయితే దానికి తగ్గట్టు ఔట్‌పుట్ వచ్చిందన్నారు. అలాగే తన ఒత్తిడి భరించి చాలా ఓపిగ్గా చక్రి ట్యూన్స్ ఇచ్చాడని, చంద్రబోస్ వంటి బిజీ మనిషి చక్రి ద్వారా తమతో కలిశారనిఅన్నాడు. ఇక తేజ సెల్ఫ్ ఐడిండెటీ కోసం జనాలు మాట్లాడుకోవాలని ఆ మాటలు చెప్పినా అక్కడికి అటెండయిన సినీ ప్రముఖులంతా నవ్వుకోవటం జరిగింది.అయినా తేజ ఏమన్నా వర్మ అనుకుంటున్నాడా...అలా మాట్లాడుతాడు,అయినా వర్మని అనుకరించే వాళ్ళు ఎక్కువయ్యారు..ఆయన టాలెంట్ ని అనుకరిస్తే మేలు కానీ ఇలా బిహేవియర్ ని అనుకరిస్తే అసహ్యంగా ఉంటుంది అని కొద్దమంది ఆ ప్రాగణంలో బహిరంగంగానే చర్చించుకోవటం జరిగింది.

అలాగే సినిమా గురించి చెబుతూ తేజ ...ఇందులో 40 మంది పిల్లలున్నారని, అందులో నలుగురు హైదరాబాదీయులు, మిగిలిన వారు బెంగాలీయులని అన్నారు. "కేక" వీధిబాలల స్టోరీ అని, వారి జీవనపోరాటం, ఆకలి, ప్రేమ, చీటింగ్, ఫైట్స్ ఇలా అన్నీ రకాల ఎమోషన్స్ కలిసిన కథ ఇదని, తెలుగు సినిమాలోనే కొత్త ఫార్మెట్‌లో ఈ చిత్రాన్ని తీశానని తేజ చెప్పారు. ప్రతీసారీ ఇట్లానే చెప్తున్నాడని మళ్ళీ వాళ్ళంతా కామెంట్ చేసుకున్నారు.

ఇక ఈ పంక్షన్ కి రాష్ట్రమంత్రి దామోదర్ రెడ్డి, సంగీత దర్శకుడు చక్రి, తమ్మారెడ్డి భరద్వాజ, డి. సురేష్ బాబు, చంద్రబోస్, దిల్ రాజు, నల్లమలుపు బుజ్జి తదితరులు హాజరయ్యారు. ముఖ్య అతిథి దామోదర్ రెడ్డి ఆడియో క్యాసెట్‌ను విడుదల చేసి, డి. సురేష్ బాబుకు అందించారు. ఆడియో సీడీని తేజ ఆవిష్కరించి దిల్‌రాజుకు అందజేశారు.

వరస పరాజయాల్లో ఉన్న తేజ ఇక ఈ చిత్రం ద్వారానయినా హిట్టిస్తే...ఇటువంటి విమర్శలు,వెనక్కి తిరిగి నవ్వుకోవటాలు తగ్గుతాయని, అలాగే బిల్డప్ కోసం వార్ని కొట్టాను,వీర్ని టార్చర్ పెట్టాను,నాకు తిక్క ఉంది వంటి స్టేట్ మెంట్స్ ఇవ్వటం మానుకోవాలనేది ఆయనకున్న కొద్దిమంది అభిమానుల కోరిక.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X