ఐటెం పాపనే హీరోయిన్‌గా మార్చేస్తున్న తేజ.. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్
తన సినిమాలో ఐటెం సాంగ్ చేసిన టాలీవుడ్ బ్యూటీకి ఏకంగా హీరోయిన్ ఛాన్స్ ఇచ్చేస్తున్నారట డైరెక్టర్ తేజ. ఇటీవలే తన 'సీత' సినిమాలో ''బుల్లెట్టు మీదొచ్చే బుల్ రెడ్డి.. రాజ్‌దూత్ మీదొచ్చే రాజిరెడ్డి'' అంటూ తన అందాలతో మత్తెక్కించిన పాయల్ రాజ్‌పుత్‌ని హీరోయిన్ గా తీసుకొని కొత్త సినిమా రూపొందించే ఆలోచనలో ఉన్నారట తేజ.
తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేడీ ఓరియంటెట్ సినిమాలో పాయల్‌కి ఛాన్స్ దక్కిందనే సమాచారం వైరల్ అవుతోంది. ఇటీవలే విడుదలైన RDX లవ్ టీజర్, ట్రైలర్ లో పాయల్ పర్‌ఫార్‌మెన్స్ చూసి ఫిదా అయిన తేజ.. ఈ నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ కాంబోపై అధికారిక ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు. ఇదే నిజమైతే ఇక పాయల్‌కి అదృష్టం పండినట్లే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమా హిట్ అవుతుందా? ఫట్ అవుతుందా? అనేది పక్కన బెడితే పాయల్ లోని క్వాలిటీస్ అన్నీ తేజ బయటపెట్టడం ఖాయం కాబట్టి.

ఇక పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుత సినిమాల గురించి చెప్పుకుంటే.. RDX లవ్ అనే ఓ డిఫెరెంట్ సినిమాలో నటిస్తోంది. సొంత ఊరి కోసం ఏదీ లెక్కచేయని గడసరి అమ్మాయిగా ఈ సినిమాలో నటిస్తోంది పాయల్. దీనితో పాటు వెంకటేష్ సరసన వెంకీమామ సినిమాలో, అలాగే రవితేజ సరసన డిస్కో రాజా సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం పాయల్ జోరు చూస్తుంటే త్వరలోనే స్టార్ హీరోయిన్ కావడం పక్కా అనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











