For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    “ఐస్ క్రీమ్ ” పాప రాజుగారి గదిలోకి దూరింది

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఐస్ క్రీమ్ పాప తేజస్వనీ మండవ ఇప్పుడు రాజుగారి గదిలోకి దూరింది. ఆమె తాజాగా కమిటైన చిత్రం టైటిల్ రాజుగారి గది. ఈ చిత్రాన్ని ఓంకార్ అన్నయ్య డైరక్ట్ చేస్తున్నారు. ఆయన గతంలో డైరక్ట్ చేసిన జీనియస్ చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. ఈ నేఫధ్యంలో ఆయన గ్యాప్ తీసుకుని ఈ కథలో లో బడ్జెట్ లో ఓ చిత్రం ప్లాన్ చేసుకుని వస్తున్నారు.

    ఈ చిత్రంలో ఓంకార్ సోదరుడు అశ్విన్ హీరోగా నటించనున్నారు. వచ్చే నెలలో ఈ చిత్రం సెట్స్ కు వెళ్లనుంది. కామెడీ ధ్రీల్లర్ గా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. ఈ మేరకు ఇప్పటికే స్క్రిప్టు వర్కు పూర్తైందని చెప్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని ఓంకార్ పూర్తి కాన్సర్టేషన్ తో ఈ స్క్రిప్టు ని రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం హర్రర్, థ్రిల్లర్ చిత్రాల ట్రెండ్ నడుస్తూండటంతో సినిమా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు.

    Tejaswi in Raju Gari Gandhi movie

    ఐస్ క్రీమ్ ...రిలీజ్ కు ముందు చిత్రం ప్రమోషన్ తో ఊదరకొట్టిన ఈ పాప తర్వాత కనపకపోవటంతో అందరూ అదే హాట్ టాపిక్ గా మాట్టాడుకుంటున్నారు .'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు', హార్ట్‌ఎటాక్‌', 'మనం' చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది తేజస్వి. ఇప్పుడు రాంగోపాల్‌ వర్మ సినిమా 'ఐస్‌ క్రీమ్‌'తో హీరోయిన్ అయిపోయింది. ఈ సినిమాలో నగ్నంగా నటించిందన్న వార్తలతో తేజస్వి మరింత పాపులర్‌ అయ్యింది. కానీ తర్వాత ఆమె ఆపర్స్ సంపాదించుకోలేకపోయింది.

    తేజస్విని మాట్లాడుతూ..... 'ఐస్‌ క్రీమ్‌' కంటే ముందే ఓ సినిమాలో చేశా. ఓంకార్‌ సోదరుడు ఇందులో హీరోగా నటించారు. 'వూర్వశివో రాక్షసివో' అనే పేరు పరిశీలిస్తున్నారు. ఇదో రోడ్‌ జర్నీకి సంబంధించిన కథ. నా పాత్ర చాలా సీరియస్‌గా ఉంటుంది. సినిమా మొత్తమ్మీద ఒక్కసారి కూడా నవ్వను. తమిళంలో ఒక సినిమా చేస్తున్నా అని చెప్పింది.

    English summary
    TV host Omkar is coming up with a new film “Raju Gaari Gadhi” and it will have ice cream fame Tejaswi Madivada in lead role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X