Don't Miss!
- News అపార్ట్ మెంట్ లో మహిళ స్నానం చేస్తుంటే సెక్యూరిటీ గార్డు ?, పిల్లర్ కు కట్టేసి పిండేసి, అంతే !
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
తేజస్వి మదివాడ బోల్డ్ షో.. మరో ఐస్ క్రీమ్ లాంటి ప్లాన్?
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో చాలా క్యూట్ గా హోమ్లీ బ్యూటీలా దర్శనమిచ్చిన వారు ఆ తరువాత మాత్రం హాట్ రోల్స్ తో షాకిస్తున్నారు. గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉండే మనస్తత్వం గలవారు అనుకుంటే.. బోల్డ్ రోల్స్ చేయడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు. తేజస్వి మదివాడ ఏ రేంజ్ లో రచ్చ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక త్వరలో ఈ బ్యూటీ మరో ఐస్ క్రీమ్ లాంటి గ్లామర్ షోతో రచ్చ చేయనునున్నట్లు తెలుస్తోంది.
ఆ సినిమాలో క్యూట్ గా..
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో హోమ్లీ బ్యూటీగా దర్శనమిచ్చిన తేజస్వి.. కనిపించింది కొద్దీ సేపే అయినా మంచి క్రేజ్ అందుకుంది. ఆ సినిమాతో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ క్యూట్ గర్ల్ ఆ తరువాత వేసిన స్టెప్పులు మాత్రం ఓ విదంగా అందరికి షాక్ ఇచ్చాయి. మొదట్లో గ్లామర్ గీతను పెద్దగా దాటలేదు.
అవకాశాల కోసం..
హీరోయిన్ గా సక్సెస్ కావాలని అనుకున్న తేజస్వి మదివాడ గట్టి ప్రయత్నాలు చేసింది. కానీ అవేమి సక్సెస్ కాలేదు. బోల్డ్ రోల్స్ చేయడానికి చాలా వరకు హద్దులు దాటేసింది. తెలుగమ్మాయిలు కూడా గ్లామర్ క్యారెక్టర్లు చేయడానికి ఏ మాత్రం తీసిపోరు అనే విధంగా గ్లామర్ డోస్ పెంచింది. అప్పుడప్పుడు కొన్ని సపోర్టింగ్ రోల్స్ తో కూడా మెప్పించే ప్రయత్నం చేసింది.
మరో ఐస్ క్రీమ్
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఐస్ క్రీమ్ సినిమాలో తేజస్వి ఏ స్థాయిలో రెచ్చిపోయిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ క్యారెక్టర్ అవకాశాలు అందించకపోయినా కూడా తేజస్వి డేరింగ్ చూసి ఓ వర్గం ఆడియెన్స్ ఆమెకు ఫిదా అయ్యారు. ఇక నెక్స్ట్ అలాంటి గ్లామర్ డోస్ పెంచడానికి ఈ బ్యూటీ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Recommended Video
వెబ్ సిరీస్?
ఒక బోల్డ్ వెబ్ సిరీస్ కోసం తేజస్వి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందులో హాట్ సీన్స్ గట్టిగానే ఉంటాయట. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ తో హీటేక్కిస్తున్న తేజస్వి ఇక వెబ్ సిరీస్ లో తన అసలైన విశ్వరూపం చూపించనున్నట్లు టాక్ వస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఆ ప్రాజెక్ట్ పై త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం.