twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కబుర్లు దాకా ఓకే... ఇంతకీ పాప క్లిక్ అవుద్దా?

    By Srikanya
    |

    హైదరాబాద్: ఎడాపెడా మీడియా తో మాట్లాడుతూ,మధ్య మధ్యలో మసాలా మాటలు చెప్తూ ఇట్టే ఆకట్టుకుంటోంది తేజస్వి . కేవలం కబుర్లేనా ...ఏమన్నా నటన గట్రా ఉన్నాయా అంటున్నారు సినీ వర్గాలు. సినీ వర్గాలు చర్చించుకుంటున్నారు అంటే...దాదాపు సినిమావాళ్ల కళ్లలో పడిందనేగా అర్దం. అయితే ఆ కబుర్లు..కెరీర్ కి ప్లస్ అయ్యి...కరెన్సీగా మారాలని పాప ప్రయత్నం చేస్తోంది. అంటే అదే మరో నాలుగు చిత్రాలు అడ్వాన్సులు పట్టాలని ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతానికి ఆమె రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం 'ఐస్‌క్రీమ్‌'లో నటించింది. ఆ చిత్రం ప్రమోషన్ లు, చెప్పే కబుర్లులలో ఆయన్నే మించి పోతోంది. ఈ నెల 11న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

    తేజస్వి మాట్లాడుతూ..... ''నేను హీరోయిన్‌ కావాలని ఎప్పుడూ అనుకోలేదు. మాస్‌ కమ్యూనికేషన్‌ చేశాను. జర్నలిస్టును కావాలనుకున్నాను. సినిమాల్లోకి రాకముందు నేను డాన్స్‌ క్లాస్‌లు చెప్పేదాన్ని. ఆ కారణంగానే అనుకోకుండా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తరువాత 'హార్ట్‌ ఎటాక్‌', 'మనం' సినిమాల్లో నటించాను. అప్పటికీ నేను హీరోయిన్‌ కావాలని గట్టి నిర్ణయం తీసుకోలేదు. కానీ, ఇప్పుడు మాత్రం ఈ ప్రొఫెషన్‌ను చాలా సీరియస్‌గా తీసుకున్నా. తెలుగు అమ్మాయిలు కూడా స్టార్‌ హీరోయిన్‌లు కాగలరని నిరూపిస్తా అంది.

    Tejaswini about her latest Ice Cream

    'లవర్‌' సినిమా ఒప్పుకున్న తరువాత నాకు రామ్‌గోపాల్‌ వర్మ నుంచి పిలుపు వస్తే వెళ్లి కలిశాను. నేను నాచురల్‌గా యాక్ట్‌ చేస్తానని కాంప్లిమెంట్‌ ఇస్తూ నాతో ఓ సినిమా చేస్తానని చెప్పారు. ఆ సినిమానే ఐస్‌క్రీమ్‌. వర్మగారితో పనిచేయడం నా అదృష్టం. ఆయన ఓ లెజెండ్‌. అయినా నేను వర్మగారి సినిమా అనే కారణంతో 'ఐస్‌క్రీమ్‌'లో నటించలేదు. నన్ను మెచ్చుకున్నందుకే చేశా. ఐస్‌క్రీమ్‌ హారర్‌, థ్రిల్లర్‌ సినిమా అని చెప్పవచ్చు. కొంచెం లవ్‌, కొంచెం కామెడీ కూడా ఉంటుంది. ఇంతకుముందు నటించిన సినిమాల్లో పర్‌ఫార్మెన్స్‌ చూపించే అవకాశం రాలేదు నాకు. ఐస్‌క్రీమ్‌తో ఆ ఛాన్స్‌ వచ్చింది అంది.

    ఇక ఈ సినిమాలో నేను న్యూడ్‌గా నటించాననే వార్త బయటకు వచ్చిన తరువాత మా బంధువులు, స్నేహితులు చాలామంది కాల్స్‌ చేసి అడిగారు. 'ఏం చేస్తున్నావ్‌ నువ్వు' అని కంగారు పడ్డారు. కానీ న్యూడ్‌ సీన్‌ అనేది ట్రిక్కీగా తీసినది. ఒక రూమ్‌లో నాలుగు కెమెరాలు ఫిక్స్‌ చేశారు. నేను ఒక్కదాన్నే వెళ్లి స్టార్‌ కెమెరా, కట్‌ చెప్పుకుని షాట్‌ ఓకే చేసుకుని వచ్చాను. అయితే అదంతా ఓ ట్రిక్కుతో జరిగింది. నేను న్యూడ్‌గా నటించానా? లేదా? అనేది సినిమా చూసిన తరువాతే అర్థం అవుతుంది. ప్రస్తుతం 'ఊర్వశివో.. రాక్షసివో..' (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాలో పూర్తి స్థాయి హీరోయిన్‌గా నటిస్తున్నా.'' అంది.

    English summary
    Ram Gopal Varma film, 'Ice Cream', which has been in progress for two months, has completed. The film is in post production work now and it is being planned to be released on July 11th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X