సినిమాల్లోకి బాలయ్య కూతురు: మోక్షజ్ఞ కంటే ముందుగానే.. ఆ భారీ ప్రాజెక్టుతోనే!
తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది వారసులు పరిచయం అయ్యారు. అందులో చాలా మంది హీరోలుగా, కొందరు మాత్రం దర్శకులుగా, నిర్మాతలుగా మారి సత్తా చాటుతున్నారు. ఇప్పుడు కూడా చాలా మందే హీరోలు తమ పిల్లలను సినిమాల్లోకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో నటసింహా నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారు. ఆయన తన కొడుకు మోక్షజ్ఞను హీరోను చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా బాలయ్య కుమార్తె టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిసింది. ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి!
బాలయ్య ప్రకటనతో ఆసక్తి:టాలీవుడ్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణకు ముగ్గురు పిల్లలు ఉన్న విషయం తెలిసిందే. అందులో ఇద్దరు అమ్మాయిలకు వివాహాలు అయిపోయాయి. దీంతో తన కొడుకు మోక్షజ్ఞను ఆయన సినిమాల్లోకి తీసుకు రావాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా వెల్లడించారు. దీంతో నందమూరి అభిమానులు మోక్షజ్ఞ రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎన్నో రకాల ప్రచారాలతో:నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ గురించి బాలయ్య ప్రకటించినప్పటి నుంచి దీనిపై ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అతడిని ఫలానా దర్శకుడు పరిచయం చేస్తున్నాడని, ఇప్పుడు యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నాడని, డ్యాన్స్ నేర్చుకుంటున్నాడని, మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్‌లో ఉన్నాడని రకరకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.
బాలయ్య కూతురు ఎంట్రీ:నందమూరి బాలకృష్ణ సినీ వారసుడుగా మోక్షజ్ఞనే పరిచయం చేస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఇప్పుడు అతడి కంటే ముందే ఆయన కుమార్తె తేజస్విని సినిమాల్లోకి అడుగు పెట్టబోతున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. బాలయ్య కూతురు ఎంట్రీపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని ఫిలిం నగర్ ఏరియాలో టాక్ వినిపిస్తోంది.

బాలకృష్ణ సినిమాతో రాక:నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సినిమాల్లోకి అడుగు పెట్టబోతుందన్న వార్త రావడంతో అసలు ఆమె ఎలా ఎంట్రీ ఇస్తుందన్న డౌట్స్ అందరిలో వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. తేజస్విని నిర్మాతగా సినీ రంగంలోకి అడుగు పెట్టబోతుందట. అది కూడా నందమూరి బాలకృష్ణ నటించే చిత్రంతోనే ఆమె ప్రొడ్యూసర్‌గా మారబోతుందని సమాచారం లీకైంది.
ఆ క్రేజీ ప్రాజెక్టే అంటూ:నందమూరి బాలకృష్ణ ఇప్పుడు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత బోయపాటి శ్రీనుతో 'అఖండ 2' మూవీని చేయనున్నారు. ఈ చిత్రం ద్వారానే తేజస్విని సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని అంటున్నారు. ఈ సినిమాకు ఆమె సహ నిర్మాతగా వ్యవహరించనుందని అంటున్నారు. దీంతో ఇప్పుడీ న్యూస్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిపోతోంది.

తెర వెనుక సక్సెస్‌గానే:వాస్తవానికి నందమూరి తేజస్విని ఇప్పటికే గ్లామర్ ఫీల్డులో పలు విభాగాల్లో పని చేసింది. ముఖ్యంగా బాలయ్య హోస్ట్ చేసిన 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' షోకు తెర వెనుక ఉండి పని చేసింది. తద్వారా ఆ షో సక్సెస్‌లో భాగం అయింది. ఇప్పుడు ఏకంగా ఆమె నిర్మాతగానూ మారబోతుంది.


Click it and Unblock the Notifications











