twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సినిమాగా కేసీఆర్ జీవిత చరిత్ర, కేసీఆర్ గా ఎవరో

    By Srikanya
    |

    హైదరాబాద్: ఇప్పుడు అంతటా బయోపిక్ చిత్రాల రాజ్యం నడుస్తోంది. తెలుగులోనూ ఆ శకం మొదలుకానుంది. అందుకు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత చరిత్ర తో ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. కొంతమంది ఔత్సాహిక ఫిల్మ్ మేకర్స్..ఆయన జీవిత చరిత్రను తెరకెక్కించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

    గత రెండు సంవత్సరాలుగా కేసీఆర్ జీవిత చరిత్రకు సంభందించిన ముఖ్యమైన ఘట్టాలను ఎంపిక చేసుకోవటం, అందుకు రీసెర్చి, పలువులను కలవటం, వాటిని క్రమ బద్దతిలో పెట్టుకుని, స్క్రిప్టు గా మలచటం వంటి పనులు చేస్తున్నట్లు వార్త.

    అంతేకాకుండా ప్రీ ప్రొడక్షన్ కూడా ప్రారంభమైందని, అయితే కేసీఆర్ గా కనిపించే వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారని, అది పూర్తి కాగానే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాసం ఉంది. అయితే జూన్ 2 తెలంగాణా అవతరణ దినోత్సవం రోజున ఈ ఎనౌన్స్ మెంట్ జరిగే అవకాసం ఉందని మరికొందరు చెప్తున్నారు.

    Telangana CM KCR biopic on cards

    ఇక ఈ బయోపిక్ చిత్రంలో తెలంగాణా ఉద్యమంలో ముఖ్యమైన ఘట్టాలు, మైలురాళ్లు ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తారని తెలుస్తోంది. అలాగే.., చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా దీన్ని మలచాలని, కేసీఆర్ నిరాహార దీక్ష, మిలియన్ మార్చ్ లకు ఇందులో ప్రత్యేక అధ్యాయాలుగా ఉంటాయని, ప్రతీ తెలంగాణా పౌరుడు ఈ చిత్రాన్ని చూసి ప్రేరణ పొందేలా భావి తరాలకు సైతం ఉద్యమంపై పూర్తి అవగాహన కలిగేలా చిత్రాన్ని మలుస్తారని చెప్పుకుంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియచేస్తాము.

    English summary
    Some film makers to come up with a biopic on Telangana CM KCR. Pre-production is in full swing and hunt is on for a actor who will play the role of KCR on screen.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X