twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డైరక్టర్ సురేంద్ర రెడ్డి పై వేటు ఉంటుందా?

    By Srikanya
    |

    తెలంగాణ ప్రాంతానికి చెందిన దర్శకుడు సురేంద్ర రెడ్డి ని ఆంధ్రా హీరోలు, దర్శకులు, నిర్మాతలు దూరంగా పెడతారా లేదా అన్నది సినీ వర్గాల్లో చాలా చోట్ల చర్చగా మారింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన దర్శకులు కొందరు యూనియన్ గా ఏర్పడటం, ఆంధ్రా నిర్మాతల చిత్రాలు తెలంగాణ ఏరియాల్లో రిలీజ్ చేయననటం ఈ చర్చకు దారి తీయిస్తోంది. వాస్తవానికి ఈ గొడవ పేరు చెప్పి ఎవరినీ దూరం పెట్టకూడదనుకున్నా తెలంగాణా వారు సినీ పరిశ్రమకు రోజు రోజుకీ ఇస్తున్న అల్టిమేటమ్స్ చూస్తే ఇటువంటి ఆలోచనలు రాక తప్పదంటున్నారు. అయితే తెలుగు హీరోలకు అంత సీన్ లేదని సురేంద్రరెడ్డి దర్శకత్వం అంటే వారు వదులుకోలేరని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మేము సురేంద్రరెడ్డి దర్శకత్వంలో చెయ్యమని చెప్పగల హీలోలు ఎవరు ఉన్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు.

    ఎందుకంటే ఇప్పటివరకూ ఏ ఆంద్రా హీరో కూడా ఇంత నష్టం జరుగుతున్నా తెలంగాణా ఇష్యూపై నోరెత్తకపోవటాన్ని ఉదాహరణ గా ఎత్తి చూపుతున్నారు. ఇక అతనొక్కడే నుంచి కిక్ వరకూ హిట్లు తీస్తు వస్తున్న సురేంద్రరెడ్డి తాజాగా స్రవంతి రవి కిషోర్ బ్యానర్ లో రామ్ హీరోగా ఓ చిత్రం కమిటయ్యారు. అలాగే మహేష్ బాబు హీరోగా ఓ చిత్రం ఓకే చేసుకున్నారు. అంతేగాక పవన్ కళ్యాణ్ కి సైతం సినిమా చేయటానికి కథ రెడీ చేస్తున్నారు. టాలెంటుకు రాజకీయాలకీ ముడి పెట్టడం సబబు కాకపోయినా అక్కడ ఆంధ్రా సినిమాలు ఆడకూడదు,వారి షూటింగ్ లపై దాడి చేస్తాం అని అంటున్నప్పుడు తెలంగాణా వారిని కూడా ప్రక్కన పెట్టడంలో తప్పేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. త్వరలో జరిగే నిర్మాతల మండలిలో కూడా ఈ ప్రశ్నలు చెలరేగే అవకాశం ఉందని వినకిడి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X