'పులి'కి తెలంగాణ సెగ - కవిత 10కోట్లు డిమాండ్..!?
తెలుగు సినిమాకి మళ్లీ తెలంగాణ టెన్షన్ పట్టుకుంది. డిసెంబర్ 9 తరవ్వాత తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా తెలంగాణేతర ప్రాంతానికి చెందిన సినిమాల విడుదల వివాదాస్పదమైన సంగతి తెల్సిందే ఆర్య2, సలీం తదితర సినిమాలకు తెలంగాణ ఎఫెక్ట్ గట్టిగా తగిలినా, ఆ తర్వాత మేటర్ చల్లారిపోయింది. తాజాగా ఇప్పుడు కొమరం పులి విషయంలో తెలంగాణ వాదులు కారాలు నూరుతోన్న సంగతి విదితమే.
ఉప ఎన్నికల్లో గెలుపు అనంతరం కొత్త ఉత్సాహంతో ఉన్న తెలంగాణ వాదులు, కొమరం పులి పై తమ ప్రతాపం చూపేందుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం పదికోట్ల రూపాయల డిమాండ్ ను చిత్ర నిర్మాత ముందు టిఆర్ ఎస్ అధినేత కెసీఆర్ కుమార్తె కవిత ఉంచారంటూ గాసిప్స్ విన్సిస్తున్నాయి. ఉప ఎన్నికల్లో తాజా ఫలితాలు కొమరం ఫులి సినిమాకే కాదు, ఇతరత్రా సినిమాలకీ ఝలక్ ఇచ్చినట్టే.
అందునా 'మా తెలుగు తల్లికి" అంటూ ఓ పాట కూడా సినిమాలో ఉండడంతో తెలుగు తల్లి అంటేనే ఆగ్రహంతో ఊగిపోయే తెలంగాణ వాదులు, కొమరం పులి ని అంత తేలిగ్గ వదిలే అవకాశాల్లేవు. మరి ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాలపై టిఆర్ ఎస్ ఎఫెక్ట్ అంతగా లేదు కాబట్టి పులిని పట్టించుకోకపోతే కొమరం పులి సేఫ్ జోన్ లో పడ్డట్టే..!


Click it and Unblock the Notifications











