Don't Miss!
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- News సీటు త్యాగం చేసిన ఆ ఎమ్మెల్యేకు జగన్ రాజ్యసభ హామీ-బహిరంగ ప్రకటన..!
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
తారా చౌదరి టేపుల్లోని తెలుగు హీరో ఎవరు?
గత కొద్ది రోజులుగా అంతటా కలకలం సృష్టిస్తున్న తారా చౌదరి టేపుల గుట్టు ఒక్కొక్కటిగా రట్టవుతున్న సంగతి తెలిసిందే. ఈ టేపుల్లో రాజకీయ నాయకలతో పాటు ఓ తెలుగు యాక్షన్ హీరో పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోందంటూ మీడియాలో వార్తులు వస్తున్నాయి. ఈ మేరకు ఓ తెలుగు టీవీ ఛానెల్ ఓ న్యూస్ ని ప్రసారం చేసింది. వారు ప్రసారం చేసిన దాంట్లో ఆ హీరో పేరు చెప్పకుండా కేవలం కొన్ని క్లూలు మాత్రమే ఇచ్చి ప్రేక్షకుల ఊహకే వదిలేసారు. దాంతో ఆ హీరో ఎవరనేది ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. ప్రేక్షకులలో సైతం ఆ హీరో ఎవరనే విషయంపై కూడా ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
ఇక ఆ హీరో కోసం ఇచ్చిన క్లూలలో మొదటిది.. ఆ హీరో తన కెరీర్ లో ఎక్కువ పోలీస్ పాత్రలే చేసాడని, ఆ పాత్రలతోటే ఎక్కువ పాపులారిటి వచ్చిందని, ఇప్పటికీ ఆ పోలీస్ పాత్రలనే చేయటానికి ఆసక్తి చూపుతున్నాడని చెప్పుకొచ్చారు. దాంతో ఎవరా హీరో.. పోలీస్ పాత్రలు చేస్తాడా... అంటూ పోలీస్ పాత్రలు చేసే హీరోలను అందరూ గుర్తు చేసుకుంటున్నారు. అలాగే ఒక చిన్న నిర్మాత రూ.3 లక్షల అప్పు తీర్చకపోవడంతో, తనతో పరిచయం ఉన్న ఇద్దరు పోలీసు అధికారులను రంగంలోకి దించినట్లు తెలిసింది.
సినిమా హీరోయిన్ అవుదామని వచ్చి వేరే దారిలేక ఇక్కడ వ్యభిచారంలో చిక్కుకుపోయానని చెప్తోంది. ఇక ఆమె సినిమాల మోజుతో వచ్చే చాలా మందిని ట్రాప్ చేసి మరీ వ్యభిచారంలోకి దింపిందంటూ అసలు ఈ కేసు మొదలైంది. మరో ప్రక్క ఈమె టేపులు ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో బాంబులు పేలుస్తున్నాయి. ఈమెతో కొద్దిపాటి పరిచయం ఉన్నవాళ్లు సైతం ఆమె పేరు చెపితే ఉలిక్కిపడుతున్నారు. ఆమె సెల్ లో తమ నెంబర్లు ఉన్నాయేమో అని కంగారుపడుతున్నారు.
గతంలో రైటర్ చిన్ని కృష్ణ సైతం ఈ వివాదంలో ఇరుక్కున్నారు. ఇక రాజకీయ నాయకులు ఇదంతా తార చౌదరిని అడ్డం పెట్టుకుని తమను దెబ్బ తీయటానికి కొందరు కావాలని చేస్తున్న కుట్ర అని స్టేట్ మెంట్ ఇచ్చేస్తున్నారు. అయితే సినిమా వాళ్లు ఎలా ఖండిస్తారో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. మరికొందరు డర్టీ పిక్చర్ తరహాలో తారా చౌదరి జీవిత చరిత్రతో సినిమా చేసేస్తే పోలా అని ప్లాన్స్ సైతం వేసుకుంటున్నారు. మొత్తానికి సినిమావాళ్లలో సైతం ఆమె గుబులు పుట్టిస్తోంది.