పెళ్లి చేసుకోబోతున్న డింపుల్ హయతి.. పెళ్లికొడుకు ఎవరు? అతడి బ్యాగ్రౌండ్ ఎంటో తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి చాలా మంది హీరోయిన్లు వస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే లోకల్ అమ్మాయిలు ఉంటున్నారు. వారిలోనూ కొందరైతే అందం, టాలెంట్ ఉన్నా ఆఫర్లను అందుకోలేకపోతున్నారు. అలాంటి భామల్లో డింపుల్ హయాతి ఒకరు. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. అవకాశాలను మాత్రం ఆశించిన రీతిలో అందుకోవడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా డింపుల్ హయాతి పెళ్లి గురించి ఓ క్రేజీ న్యూస్ టాలీవుడ్‌లో వైరల్‌గా మారిపోయింది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి!

అలా వచ్చిన తెలుగు పిల్ల
బెజవాడకు చెందిన డింపుల్ హయాతి మోడల్‌గా కెరీర్‌ను మొదలు పెట్టింది. అందులో తనదైన అందంతో మెప్పించిన ఈ భామ.. సినిమా వాళ్ల దృష్టిని ఆకర్షించింది. ఫలితంగా ఈ భామకు సినిమా ఛాన్స్‌లు వచ్చాయి. ఇలా డింపుల్ హయాతి 'గల్ఫ్' అనే సినిమాతో నటిగా మారింది. దీని తర్వాత 'అభినేత్రి 2' మూవీలోనూ కీలక పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

Telugu Actress Dimple Hayathi Marriage News Gone Hot Topic in Tollywood

పాటతో ఫుల్.. వరుసగానే
ఆరంభంలోనే ఎన్నో చిత్రాల్లో నటించినా డింపుల్ హయాతికి ఆ తర్వాత ఆఫర్లు మాత్రం ఆశించిన రీతిలో లభించలేదు. ఆ సమయంలోనే 'గద్దలకొండ గణేష్' మూవీలో డింపుల్ 'సూపర్ హిట్టు' అనే స్పెషల్ సాంగ్‌లో మెరిపించింది. దీంతో ఫుల్లు క్రేజ్ అందుకున్న డింపుల్.. ఆ తర్వాత తెలుగులో 'ఖిలాడి' మూవీ చేసింది. ఇందులో గ్లామర్ షోతో రచ్చ లేపేసింది.

సినిమాలు చేసింది కానీ
పేరుకు తెలుగు అమ్మడే అయినా డింపుల్ హయాతి 'అత్రంగి రే' అనే హిందీ సినిమాలోనూ నటించింది. అలాగే, 'వీరమై వాగై సూడుమ్' అనే తమిళ చిత్రంలో చేసింది. ఇక, తెలుగులో డింపుల్ రవితేజతో 'ఖిలాడి' తర్వాత గోపీచంద్‌తో 'రామబాణం' చిత్రాలు చేసింది. కానీ దురదృష్టవశాత్తూ ఈ మూవీలు అన్నీ డిజాస్టర్లే అయ్యాయి. దీంతో ఆమెకు నిరాశే ఎదురైంది.

Telugu Actress Dimple Hayathi Marriage News Gone Hot Topic in Tollywood

వివాదం.. భారీ మూవీలో
తక్కువ చిత్రాలతోనే డింపుల్ హయాతికి మంచి గుర్తింపు కూడా లభించింది. ఇలా ఈ అమ్మడు గత ఏడాదిలో ఓ వివాదంలో చిక్కుకుంది. ఈ గొడవ కారణంగా ఈ హీరోయిన్ కోర్టులు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగింది. ఇక, డింపుల్ హాయాతి ప్రస్తుతం విశ్వనాయకుడు కమల్ హాసన్ 'ఇండియన్ 2'లో ఓ స్పెషల్ సాంగ్‌ను చేసిందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.

పెళ్లికి రెడీ అయిన లేడీ
ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్లుగా చేస్తున్న వాళ్లంతా పెళ్లికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు డింపుల్ హయాతి కూడా వివాహం చేసుకోబోతుందని తాజాగా ఓ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఆమె అతి త్వరలోనే ఏడడుగులు నడవబోతుందట. దీనిపై డింపుల్ హయాతి సోషల్ మీడియాలో ప్రకటన చేయబోతుందని టాక్.

Telugu Actress Dimple Hayathi Marriage News Gone Hot Topic in Tollywood

పెళ్లి కొడుకు ఎవరంటే
ఫిలిం నగర్ ఏరియా సమాచారం ప్రకారం.. తెలుగు హీరోయిన్ డింపుల్ హయాతి హైదరాబాద్‌కు చెందిన ఓ బడా వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతుందట. అతడితో సదరు హీరోయిన్ చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తున్నట్లు తెలిసింది. వీళ్లిద్దరి పెళ్లికి పెద్దలు కూడా ఒప్పుకున్నారని తెలిసింది. ఇదే నిజం అయితే డింపుల్ హయాతి కెరీర్ ఏమౌతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X