బుల్లితెరపై బ్లాక్ లిస్ట్‌లో యాంకర్ శ్యామల.. రెంటికి చెడ్డ రేవడిలా పరిస్థితి?
తెలుగు బుల్లితెర దగ్గర ప్రెజెంట్ చాలా మందే యువ యాంకర్ లు ఉన్నారు. మేల్ అండ్ ఫీమేల్ లో కూడా చాలా మంది తమ తమ శైలిలో పలు షోలు, సీరియల్స్ కూడా చేస్తున్న వారు కూడా లేకపోలేరు. అయితే యాంకర్స్ గా వచ్చి సినిమాల్లో కూడా బాగానే ఛాన్స్ లు పట్టేసిన వారు కూడా లేకపోలేరు. మరి అలాంటి కొంచెం మందిలో ప్రముఖ యాంకర్ శ్యామల కూడా ఒకరు.
కాగా యాంకర్ శ్యామల పేరు అయితే గడిచిన ఈ రెండు నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపించింది. కాకపోతే ఇది ఏమి ఆమె సినిమాల్లో చేసేసిన ఎక్స్ట్రా ఆర్డినరీ పెర్ఫామెన్స్ కోసం అయితే కానే కాదు పొలిటికల్ గా ఎవరి మెప్పునో పొందేందుకు ఆమె చేసిన అతి కామెంట్స్ ఇప్పుడు ఆమె కెరీర్ పై బాగా ప్రభావం చూపినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఆమె ఏదైతే ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉందో అక్కడ నుంచి వెళ్లి ప్రముఖ హీరో, అలాగే రాజకీయ నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ మీద చేసిన పలు అనుచిత వ్యాఖ్యలు మూలాన మరింత పాపులర్ అయ్యింది. పైగా ఆమె పవన్ కళ్యాణ్ ని అభివర్ణిస్తూ ఓ కథ చెప్పడం కూడా బాగా నెగిటివ్ ఆమె మీద తీసుకురాగా తీరా పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఆమెకి ఎదురు దెబ్బ తప్పలేదు.
కాగా ఇప్పుడు ఈ అంతటి ప్రభావం ఆమె ప్రొఫిషినల్ కెరీర్ పై పడినట్టుగా కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. మెయిన్ గా తెలుగు స్మాల్ స్క్రీన్ పై అయితే ఈమెని బ్లాక్ లిస్ట్ లో పెట్టరని వినిపిస్తుంది. ఇక మీద ఈమెకి ఎలాంటి అవకాశాలు కూడా ఇవ్వబోయేది లేదని తెలుస్తుంది. అయితే ఇది కేవలం యాంకర్ గా మాత్రమే కాకుండా నటిగా కూడా ఈమెని బ్లాక్ లిస్ట్ లో పెట్టారని అంటున్నారు. అయితే సొంత పార్టీ నుంచి కూడా ఎవరూ పట్టించుకోవడం లేదనే మాట కూడా వినిపిస్తున్నది.

జస్ట్ గత ఏడాదిలోనే ఈమె మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ థ్రిల్లర్ సినిమా "విరూపాక్ష" లో మంచి పాత్ర చేసి బాగా ఫేమ్ తెచ్చుకుంది. కానీ ఈ ఏడాదిలో తేజు మావయ్యపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మూలాన ఇప్పుడు అవకాశాలు పోగొట్టుకున్నట్టు అయ్యిందని చెప్పక తప్పదు. అయితే ఇది ప్రస్తుతానికి వినిపిస్తున్న ఊహాగానమే కాగా ఎంతవరకు నిజం అనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











