ఆమె ట్రాన్ఫర్: ఇక టాలీవుడ్లో బూతు సీన్ల జోరు?
హైదరాబాద్: తెలుగు చిత్ర సీమకు సెన్సార్ బోర్డ్ చీఫ్ ఆఫీసర్‌గా ఉన్న ధనలక్ష్మి గురించి తెలియని వారుండరు. గత కొంత కాలంగా తెలుగు సినిమాల్లో బూతు సీన్లు, బూతు డైలాగులను ఆమె చీల్చి చెండాడుతున్నారు. పలు సందర్భాల్లో రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకులు ఆమెతో గొడవ పెట్టుకున్నారు కూడా.
ముఖ్యంగా మహిళలకు సంబంధించిన శృతి మించిన ఎక్స్ ఫోజింగ్ సీన్లు, డబుల్ మీనింగ్ డైలాగులు, హింస, నీచమైన సంబాషణల పట్ల ఆమె కఠినంగా వ్యవహరిస్తూ వాటికి చెక్ పెడుతూ వస్తున్నారు. ఆమె వ్యవహార శైలి కారణంగా బూతు కంటెంటును నమ్ముకుని సినిమాలు తీసిన చాలా మంది దర్శక నిర్మాతలు ఇబ్బంది పడ్డారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ధన లక్ష్మి హైదరాబాద్ నుండి ట్రాన్స్ ఫర్ అయినట్లు తెలుస్తోంది. దీంతో పరిశ్రమలోని పలువురు దర్శకులు, నిర్మాతలు హ్యాపీ పీలవుతూ పండగ చేసుకుంటున్నట్లు సమాచారం. ఆమె వెళ్లి పోయాక సినిమాల్లో బూతు సీన్ల డోసు పెంచి డబ్బులు దండుకోవచ్చని పలువురు సంబర పడుతున్నారట.
మరి ధనలక్ష్మి గారు వెళ్లి పోయిన తర్వాత వచ్చే వారు.....ఆమెలా కఠినంగా వ్యవహరిస్తారా? లేదా? అనేది హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications