For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బూతుల వల్లే సెన్సార్ ఆగ్రహం ... జబర్దస్ట్ షో ఆగిపోకతప్పదా?

  |

  ఈ టీవీ లో ప్రతీ గురువారం, శుక్రవారం వచ్చే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షో లు ఆగిపోనున్నాయనే వార్త వినిపిస్తోంది. ఇన్నాళ్ళూ నాగబాబు, రోజా జడ్జీలుగా కొనసాగుతూ వచ్చిన ఈ పాపులర్ కామెదీ షో ఇక ఆగిపోనుందంటూ వార్తలు వస్తున్నాయి. ఖచ్చితమైన టైం అంటూ చెప్పలేం గానీఎప్పుదుదైనా ప్రసారం నిలిపి వేయవచ్చట. అయితే దీని వెనుక పోటీ చానెళ్ళ కుట్రకూదా ఉందనే మాటలూ ఉన్నాయనుకోండీ... ఇంతకీ మ్యాటరేమిటంటే...

  రియాలిటీ షో

  రియాలిటీ షో

  ఒకప్పుడు తెలుగులో రియాలిటీ షోలూ తక్కువగానే ఉండేవి. అప్పుడప్పుడూ ప్రసారమయ్యే షో లు కూడా పెద్దగా సక్సేస్ అవలేదు. అసలు సీనియర్ యాంకర్ సుమ నిర్వహించే స్టార్ మహిళ లాంటి ప్రోగ్రాం కూడా కేవలం గృహిణులు చూసే షో మాదిరి గానే మిగిలిపోయింది. అప్పటి వరకూ ఎక్కువ ఆదరణ పొందింది గాయకుడు బాలసుబ్రహ్మణ్యం నిర్వహించిన పాడుతా తీయగా మాత్రమే.

  డాన్స్ బేబీ డాన్స్

  డాన్స్ బేబీ డాన్స్

  తెలుగు ప్రేక్షకులకు ఇలాంటి షో లు నచ్చవేమో..! అనుకుంటున్న సమయం లోనే జెమినీ టీవీ నిర్వహించిన డాన్స్ బేబీ డాన్స్ లాంటి షో చిన్న పాటి జెర్క్ ని తెచ్చింది. ఆ తవాత ఓంకార్ తీసుకొచ్చిన ఆటా, ఈటీవీ ఢీ లు జనాల్లో మంచి ఆదరణనే పొందాయి. కానీ ఆ ప్రోగ్రాముల్లో కూడా జరిగే కాంట్రవర్సీలూ, చిన్న పిల్లలతో చేయించే అసభ్యకర భంగిమల డాన్స్ ల వల్ల కాస్త అవీ మసకబారటం మొదలయ్యింది.

  జబర్దస్త్

  జబర్దస్త్

  జనాల్లో కూడా ఇంట్రస్ట్ తగ్గటం మొదలయ్యింది. దాంతో కొత్త మార్గాలను వెతకటం మొదలు పెట్టిన ప్రోగ్రాం ప్రొడ్యూసర్లకు కనిపించిన ఆప్షన్ "కామెడీ".. ఈ ఆలోచన సూపర్ కాదు అంతకు మించి హిట్ అయ్యింది... జబర్దస్త్ పేరుతో కామెడీ కంటెంట్ తో వచ్చిన షో ప్రతీ ఇంటి లోనూ నవ్వులు పూయించింది....

  ఎక్స్ట్రా జబర్దస్త్

  ఎక్స్ట్రా జబర్దస్త్

  జబర్దస్త్ మొదలయిన కొన్నాళ్ళకే మిగతా చానెళ్ళు కూడా ఇదే పద్దతిలో కామెడీ పండించే ప్రయత్నాలు చేసాయీ, చేస్తూనే ఉన్నాయి గానీ జబర్దస్త్ ని మాత్రం అందుకోలేకపోయాయి. వారానికి ఒక్కరోజు ప్రసారమయ్యే ఈ షో టీఆర్పీలని పీచి పిచ్చిగా సాధిస్తూండటం తో ఎక్స్ట్రా జబర్దస్త్ పేరుతో శుక్రవారం కూడా ప్రసారం చేయటం మొదలు పెట్టారు.

  కొత్త కొత్త కామెడీ

  కొత్త కొత్త కామెడీ

  ఈ క్రమం లోనే ఎప్పటికప్పుడు కొత్త కొత్త కామెడీ స్క్రిప్టులు రాసుకోవాల్సి రావటం తో మరింత నవ్వించటానికి బూతు కంటెంట్ వాడుకోవటం మొదలు పెట్టారు కమేడియన్లు. అంతే కాదు కొన్ని సార్లు కొన్ని కులాలను కూడా కించపరిచారనీ, కొందరు నటుల మీద అభ్యంతర కర సెటైర్లు వేసారనీ కమేడియన్ల మీద దాడులూ, కేసులూ నమోదయ్యాయి.

  మరింత ఎక్కువయ్యాయి

  మరింత ఎక్కువయ్యాయి

  అయినా జబర్దస్త్ రేంజ్ ఏమీ తగ్గక పోగా మరింత ఎక్కువయ్యాయి... ఇది ఎక్కడిదాకా వెళ్ళిందీ అంటే కేవలం ఈ తరహా రియాలిటి షోలని బేస్ చేసుకొని ఒక ప్రత్యేక చానెల్ నే మొదలు పెట్టేసింది ఈటీవీ... ఇక ఈ బూతుల పర్వం అక్కడా మొదలయ్యింది. కామెడీ చెయ్యటం అంటే బూతులు మాట్లాడటం అనుకున్నారో లేక యువతీయువకులని ఆకర్షించటమే పనిగా పెట్టుకున్నారో గానీ వీళ్ళ ప్రోగ్రాం మాత్రం ఇంటిల్లి పాదీ చూదటం ఇబ్బందిగానే ఉంటోంది.

  రవీ, శ్రీ ముఖీ

  రవీ, శ్రీ ముఖీ

  యాంకర్లు రవీ, శ్రీ ముఖీ లు నిర్వహించే "పటాస్" అయితే ఇప్పుడు ఎంత పాపులరో అంత దారుణమైన బూతులతో నిండిపోయింది. ఈ ప్రోగ్రాం మీద కూడా చాలానే కంప్లైంట్స్ ఉన్నాయి. అయితే ఎన్ని కంప్లైంట్లు ఉన్నా టీఆర్పీ బాగానే వస్తూండటం తో ఆ షోని మరింత గా అదే పద్దతిలో నడిపిస్తున్నారు నిర్వాహకులు.

  జబర్దస్త్ ఆగిపోనుందా..?

  జబర్దస్త్ ఆగిపోనుందా..?

  అయితే ఇంత విప్లవాత్మకమైన మార్పుని తెచ్చిన స్టార్ కామెడీ షో ఇప్పుడు ఆగిపోనుందా..?? అంటే ఔననే వినిపిస్తోంది. మొదట్లో జబర్దస్త్ అంటే పడిపడి నవ్వేవాళ్ళు.. జుగుప్సాకరమైన వ్యాఖ్యలు లేకుండా సాధారణ సరళిలో తమాషాగా డైలాగ్‌లు ఉంటూ ఇంటిల్లిపాది నవ్వుకునేవారు.

  బూతులే బూతులు

  బూతులే బూతులు

  ఇక రాను రాను స్కిట్‌లు చేసేవారు మరింత రెచ్చిపోయారు. బూతులే బూతులు... డబుల్ మీనింగ్ డైలాగ్‌లు‌.. అమ్మాయి వేషధారణలో అబ్బాయి. ఇక ఆ వేషధారణలో ఉన్న వ్యక్తిని ఆడుకుంటారు... ఒకరకంగా.. మామూలుగా కాదు.. నోరు తెరిస్తే డబుల్ మీనింగ్ బూతులే.

  కళ్ళెవడైనా

  కళ్ళెవడైనా "మింగాడా?"

  ఒక కమెడియన్ అయితే డైరెక్ట్ గా నిజం బూతులనే వాడేస్తూంటాడు. "కళ్ళెవడైనా మింగాడా?", "పేరు బంగారూ...దాన్ని చాలామంది.... " అంటూ దారుణమైన మాటలని వాడేస్తూంటే పిల్లలతోనూ, కుటుంబం తోనూ చూడటానికి చాలా ఇబ్బంది పడుతున్నారంటూ విమర్శలుమొదలయ్యాయ్.

  సెన్సార్ బోర్డుకు ఫిర్యాదులు

  సెన్సార్ బోర్డుకు ఫిర్యాదులు

  అంతేకాదు.. కొంతమంది మహిళలైతే ఏకంగా సెన్సార్ బోర్డుకే ఫిర్యాదులు చేశారు. మరికొంతమంది మనకెందుకులే అని మౌనంగా వుండిపోయారు. కంప్లైంట్ ఇచ్చినవారు వేరే ఎంటర్టైన్మెంట్ ఛానళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఒత్తిడి చేయడంతోనే సెన్సార్ బోర్డును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

  క్షణంలోనైనా ఆగిపోవచ్చు

  క్షణంలోనైనా ఆగిపోవచ్చు

  జబర్దస్త్ మీద ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో ఇక సెన్సార్ బోర్డు కూడా ఆ ఛానల్‌‍కు ఛీవాట్లు పెట్టింది. ఆ కార్యక్రమాన్ని ఎత్తివేయాలని ఆదేశించిందట. అయితే కొంత సమయం కావాలని ఛానల్ యాజమాన్యం సెన్సార్ బోర్డును రిక్వెస్ట్ చేయగా అందుకు సభ్యులు ససేమిరా అన్నారట. ఏ క్షణంలోనైనా ఆ కార్యక్రమాన్ని ఆపేయాలన్న ఆదేశాలు ఉండటంతో ఆ ఛానల్ నిర్వాహకులకు ఏం చేయాలో పాలుపోవడం లేదట.

  క్షణంలోనైనా ఆగిపోవచ్చు

  జబర్దస్త్ మీద ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో ఇక సెన్సార్ బోర్డు కూడా ఆ ఛానల్‌‍కు ఛీవాట్లు పెట్టింది. ఆ కార్యక్రమాన్ని ఎత్తివేయాలని ఆదేశించిందట. అయితే కొంత సమయం కావాలని ఛానల్ యాజమాన్యం సెన్సార్ బోర్డును రిక్వెస్ట్ చేయగా అందుకు సభ్యులు ససేమిరా అన్నారట. ఏ క్షణంలోనైనా ఆ కార్యక్రమాన్ని ఆపేయాలన్న ఆదేశాలు ఉండటంతో ఆ ఛానల్ నిర్వాహకులకు ఏం చేయాలో పాలుపోవడం లేదట.

  English summary
  Jabardast show may be stpped..!? Censor board member Nandanam Diwakar filed a police Case Against Telugu TV comedy shows Patass and Jabardasth. Jabardasth with a tagline of Katharnak Comedy Show, is a Telugu TV comedy show, rated "5 star" among Telugu shows, and broadcast on the ETV channel.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X