ఆ టీవీ ఛానెల్స్ పై తెలుగు ఫిలిం ఛాంబర్ బ్యాన్
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కొన్ని న్యూస్ ఛానెల్స్ పై వేటు వేయటానికి సిద్దమవుతోందని సమాచారం. కేవలం ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ ని మాత్రమే ఎంకరేజ్ చేస్తూ మిగతా ఛానెల్స్ ని బ్యాన్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం ప్రింట్ మీడియా రోజుల్లో రాని వార్తలన్నీ టీవి ఛానెల్ల పోటీ వల్ల రావటమేనని, దాని వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్తున్నారు. ఇక ఎలక్ట్రానిక్ మీడియా పెరిగిపోవటం వల్ల తమ పనులుకు ఇబ్బంది ఎదురౌతోందని, కొన్ని కొత్త తలనొప్పులను ఎదుర్కోవాల్సి వస్తోందని అంటున్నారు.
ఇక ఎంటర్ట్మెంట్ ఛానెల్స్ అయితే న్యూస్ ఛానెల్స్ లా బ్రేకింగ్ న్యూస్ కోసం తహతహలాడుతూ ప్రతీ విషయాన్ని కవర్ చేసేయటానికి ఉత్సాహం చూపవని, దాని వల్ల కొన్ని అనారోగ్య ధోరణులుకు బ్రేక్ వేసినట్లు అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. దాంతో మాటీవి, జెమిని టీవి, ఈటీవి, టీవీ నైన్, టీవీ వన్ లను మాత్రమే సినిమా కార్యక్రమాలకు పర్మిషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరి కొద్ది రోజుల్లోనే ఈ నిర్ణయం అమలయ్యే అవకాశం ఉంది. అయితే దీనివల్ల మిగతా మీడియా ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. ఎందుకంటే పోటీ ప్రపంచంలో కొందరికే న్యూస్ అంది మిగతా వారికి అందకపోతే రేటింగ్ లు పడిపోతాయి. అలాగే ఇప్పటికే ఎక్సక్లూజివ్ ఇంటర్వూలు, ఆడియో ఫంక్షన్స్ అంటూ అన్ని ఛానెల్స్ వారినీ సినిమా ఫంక్షన్స్ కి రానివ్వకండా కట్టడి చేసి సినిమా వారు బిజినెస్ చేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











