తేజ ఈ సారి కొట్టిందెవరినంటే...

దాంతో అలిగిన ఆ హీరో ఆ రోజు షూటింగ్ నుంచి వాకవుట్ చేసాడు. మరుసటి రోజు షూటింగ్ కి వెళ్ళనన్నాడు.దాంతో విషయం కనుక్కున్న పెద్ద వాళ్ళు తమ ఇంటి అల్లుడు డైరక్టర్,రైటర్ అయిన త్రివిక్రమ్ తో కలసి తేజాని కలసి నిలదీసారుట. ఎందుకు కొట్టాల్సి వచ్చిందన్న దానికి తేజ అసలు మీవాడికి ఏక్టింక్ రాదు...పైగా నన్ను పై నుంచి క్రిందకు చూసే అంతటి మొనగాడా ఏమనుకుంటున్నాడు అని సీరియస్ అయ్యాడు. అంతే గాక మీ కొడుకు కాబట్టి నేను కామ్ గా ఉన్నా...అదే మరొకడు అయితే అసలు ఈ సినిమాను ఆఫు చేసి ఉండేవాడ్ని అంటూ అరిచాడుట.
దానికి వాళ్ళు సైలెంట్ గా మేమే ఆ మాత్రం సెల్ప్ రెస్పెక్ట్ మెయింటైన్ చెయ్యమని మా అబ్బాయికి చెప్పాం అని వెళ్ళిపోయారుట ఆ కుర్రాడ్ని తీసుకుని. తర్వాత ఏం జరిగిందో ఏమో తేజా కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ షూటింగ్ చేసి సినిమా ఫినిష్ చేసాడంటున్నారు. ఎందుకు తేజా సైలెంట్ గా ఉన్నాడంటే అందరి హీరోలుని పరిచయం చేయటానికి డబ్బు తీసుకున్నట్లే వీళ్ళ దగ్గరా తీసుకోవటమేనని,తన పరిస్ధితి బాగోకపోవటమే కాంప్రమైజ్ అవ్వటానికి కారణమని గుసగుసలాడుతున్నారు.అదీ సంగతి


Click it and Unblock the Notifications











