పవన్ కళ్యాణ్ జీవితంపై సినిమా? ఆ విషయాలు కూడా..?
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అటు సినిమాల పరంగా ఇటు వ్యక్తి గత జీవితం ఆయన రూటే సపరేటే. ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఈ నేపథ్యంలో ఆయన జీవిత చరిత్రపై సినిమా తీయాలనే ఆలోచన కొందరు దర్శక నిర్మాతలు చేస్తున్ననట్లు ఫిలింనగర్ టాక్.
మరో వైపు ఆయన సినిమా లంటే మహా క్రేజ్. ప్రస్తుతం ఉన్న హీరోల్లో ఏ సినిమా హీరో లేని డిమాండ్ పవన్ కళ్యాణ్‌కు ఉంది. ఆయన సినిమా విడుదలైందంటే థియేటర్లన్నీ కిక్కిరిసి పోతాయి. మొదటి వారం రోజులు సగం మంది టిక్కెట్లు దొరకక వెనక్కి వెళ్లి పోతారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
పవన్ కళ్యాణ్ సినిమా హిట్టయినా, ఫట్టయినా నిర్మాతలకు లాభాలే. హిట్టయితే భారీ లాభాలు, ఒక వేళ ప్లాపయినా....నష్టాలు మాత్రం అస్సలు ఉండవు. ఆయన సినిమాలు చూసేందుకు అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తి చూపుతుండటమే ఇందుకు కారణం. పవన్ కల్యాణ్‌కు ఇంత ఫాలోయింగ్ పెరగడానికి కారణం ఆయన సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితం కూడా ఓ కారణమే.
ఈ అంశాలన్నింటినీ బేస్ చేసుకుని కథ తయారు చేస్తున్నారని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు బయటకు వెల్లడించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈ సినిమాను తీయడానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారా? లేదా? అన్నది ఆసక్తి కరంగా మారింది.

పవన్ కళ్యాణ్ కెరీర్
ముగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ ‘అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.

ప్రత్యేక గుర్తింపు
తన స్టైల్ అండ్ మేనరిజంతో పవన్ కళ్యాణ్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే పవన్ కళ్యాణ్ అంటే యూత్ బాగా అభిమానిస్తారు.

వ్యక్తిగతం...
వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం భిన్నంగా ఉంటుంది. సేవా కార్యక్రమాల్లో ఆయన ముందుంటారు. అంతటితో ఆగకుండా అభిమానులు కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా ఆయన ఆదర్శంగా నిలుస్తున్నారు.

వైవాహిక జీవితం
పెళ్లికి ముందు రేణుదేశాయ్‌తో సహజీవనం చేయడం, పిల్లల్ని కనడం పవన్ కళ్యాణ్ కే చెల్లింది. ఆయన వివాహాలు కూడా ఆసక్తికరం.

రాజకీయ జీవితం
అన్నయ్య చిరంజీవి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో బీజేపీ తరుపున ప్రచారం చేయడం, ఈ కుళ్లు రాజకీయాలను నిర్మూలించడమే లక్ష్యంగా ‘జనసేన' పార్టీ స్థాపించడం ఒక సెన్సేషన్


Click it and Unblock the Notifications











