దిల్ రాజు ఆధ్వర్యంలో తెలంగాణ రాయబారం!?
తెలంగాణా ఏరియాలో సినిమాల ప్రదర్శన అడ్డుకోవటంతో చాలా సినిమాలు విడదల వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. అయితే విడుదల జాప్యం అయితే తమ పెట్టుబడుల వడ్డీలు పెరగటం, ఫైనాన్సియర్స్ ఒత్తిడి ఎక్కువ అవటం గమనించిన కొందరు ధైర్యం చేసి చిత్రాలు విడుదల చేస్తున్నారు. అయితే కొందరు నిర్మాతలు మాత్రం దీనికో పరిష్కారం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం కొందరు నిర్మాతలు తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడి దిల్ రాజు ఆధ్వర్యంలో తెలంగాణ జేఏసీ నేతలను కలిశారని ఫిల్మ్ నగర్ విశ్వసనీయ సమాచారం. తెలంగాణలో తెలుగు సినిమాల విడుదలకు ఆటంకం కలుగుతున్న ఇబ్బందికర పరిస్థితిని తొలగించమని వారిరిన కోరారు. అయితే తమ షరతులకు అంగీకరిస్తే ఆ సినిమాల విడుదలను అడ్డుకోమని నిర్మాతలకు జేఏసీ నేతలు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఆ షరతులలో మేజర్ గా రిలీజులు కోరుతున్న హీరోలు తెలంగాణాకు బహిరంగ మద్దతు ప్రకటించాలని చెప్పినట్లు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











