RC16: రామ్ చరణ్ మూవీలో మరో తెలుగు హీరో.. ఇదెక్కడి ట్విస్టు బాబోయ్
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నా.. అందులో కొందరు మాత్రమే ప్రపంచ స్థాయి గుర్తింపును సొంతం చేసుకుని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్న అతడు.. RRR మూవీతో గ్లోబల్ స్టార్ అన్న బిరుదును కూడా సొంతం చేసుకున్నాడు. దీంతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో 'గేమ్ చేంజర్' సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్నారు. ఈ సినిమా షూటింగ్ పట్టాలపై ఉండగానే రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు సనతో ప్రకటించాడు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. బుచ్చిబాబు సనతో చేసే సినిమా క్రీడా నేపథ్యంతో రాబోతుందని ఇప్పటికే న్యూస్ లీకైంది. అంతేకాదు, ఇందులో హీరో కబడ్డీ ప్లేయర్‌గా నటించబోతున్నాడని అంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. చరణ్.. శంకర్ సినిమాను పూర్తి చేసిన వెంటనే ఇది మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
పాన్ ఇండియా రేంజ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోయే ఈ సినిమాలో ఎంతో మంది బడా యాక్టర్లు భాగం కాబోతున్నారు. ఇందులో భాగంగానే ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన లయను ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారని, విలన్‌గా కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిని ఎంపిక చేశారని ఇప్పటికే న్యూస్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

తాజా సమాచారం ప్రకారం.. రామ్ చరణ్ - బుచ్చిబాబు సన సినిమాలో మరో తెలుగు హీరో కూడా నటిస్తున్నాడట. అత్యంత ముఖ్యమైన ఈ పాత్ర కోసం టాలీవుడ్‌లోని ఓ యంగ్ హీరోనే తీసుకోవాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయినట్లు తెలిసింది. ప్రస్తుతం బుచ్చిబాబు మదిలో కొందరు హీరోలు ఉండగా.. రామ్ చరణ్ నిర్ణయం కోసం అతడు వేచి చూస్తున్నాడని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో రాబోయే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందనుంది. దీన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకటేష్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. అలాగే, ఈ మూవీకి మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇవ్వబోతున్నారు.


Click it and Unblock the Notifications











