షాకింగ్ న్యూస్... సామ్, నిహారిక బాటలో మరో తెలుగు హీరోయిన్ విడాకులు
సినిమా ఇండస్ట్రీలో సెలబ్రెటీల విడాకులు ఈ మధ్యకాలంలో కలకలం రేపుతునే ఉన్నాయి. ఆ మధ్య నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోగా.. ఇటీవల నాగబాబు కూతురు నిహారిక, జొన్నలగడ్డ చైతన్య విడాకులు తీసుకోవడం సంచలనం సృష్టించింది. ఇక వారి బాటలోనే మరో తెలుగు హీరోయిన్ విడాకులు తీసుకోబోతున్నట్లు గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెట్టింట దీనిపై చర్చ సాగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే...
సోషల్ మీడియాలో వైరల్: సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రేటీల గురించి గాసిప్స్ రావడం సహాజం. ఏదో ఒక వార్త రాస్తూనే ఉంటారు. అయితే అందులో కొన్ని ఫేక్ వార్తలు ఉండగా.. మరికొన్ని నిజాలు ఉంటాయి. తాజాగా ఓ నటి.. సామ్, నిహారిక బాటలోనే విడాకులు తీసుకోబుతున్నట్లు న్యూస్ వైరల్ గా మారింది. ఆమె ఎవరో కాదు.. కలర్స్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కలర్స్ స్వాతి. ఇప్పుడు ఆమెకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె త్వరలో తన భర్తతో విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కలర్స్ ప్రోగ్రాంతో గుర్తింపు: కలర్స్ ప్రోగ్రాంతో స్వాతి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ ప్రోగ్రామ్ పేరునే తన ఇంటి పేరుగా మార్చుకుంది. ఆ క్రేజ్ తో ఆమెకు మంచి ఆఫర్స్ వచ్చాయి. పలు సినిమాల్లో నటించి.. ప్రేక్షకులను అలరించింది. ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. అయితే కలర్స్ స్వాతి.. భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. దానికి కారణం కలర్స్ ఇన్ స్టాగ్రామ్ నుంచి.. తన భర్త ఫోటోలను తొలగించింది. అందుకే ఈ వార్తలు మరింత బలపడ్డాయి.

అలా హింట్ ఇచ్చిన స్వాతి: ఇక నిహారిక, సామ్ కూడా మొదట.. తమ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ఫోటోలు వెడ్డింగ్ ఫోటోలు తొలగించారు. ఇప్పుడు అదే దారిలో స్వాతి కూడా వెళ్తుంది అని నెటిజన్స్ గుర్తు చేస్తున్నారు. వారు కూడా ఇలాగే విడాకులకు రెండు నెలల ముందు తమ భర్తలను అన్ ఫాలో చేసి విడాకుల హింట్ ఇచ్చారు. ఇప్పుడు స్వాతి కూడా అలాగే చేయడంతో నిజంగానే విడాకులు తీసుకోబోతుందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

వికాస్ అనే వ్యక్తితో ప్రేమలో: కలర్స్ స్వాతి సినిమాల్లో నటిస్తున్నప్పుడే వికాస్ వాసు అనే వ్యక్తితో ప్రేమలో పడింది. అలా కొన్ని సంవత్సరాలు రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఇక వీరు 2018 లో వివాహం చేసుకున్నారు. అయితే దాదాపు రెండు సంవత్సరాల క్రితం స్వాతి విడాకులు తీసుకుంటున్నట్టు ఇదే తరహాలో రూమర్స్ వచ్చాయి. అప్పుడు స్వాతి తన భర్త ఫోటోలను ఇలాగే ఇన్ స్టాగ్రామ్ నుంచి తొలగించింది. అప్పట్లో దీనిపై విపరీతంగా వార్తలు వచ్చాయి. స్వాతి తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు రాగా.. వాటిపై స్పందించింది స్వాతి.

గతంలోనూ రూమర్స్: సోషల్ మీడియాలోని తన భర్త ఫోటోలను ఆర్కైవ్స్ లో పెట్టుకున్నట్టు చెప్పుకొచ్చింది. తాము విడిపోలేదు అని ప్రూవ్ చేసుకోడానికి తన ఫోన్ లో ఉన్న భర్త ఫోటోలను చూపించుకోవాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పుడు స్వాతి తన భర్త ఫోటోలను తొలగించడంతో స్వాతి కూడా సమంత, నిహారిక లాగానే విడాకులకు కొన్ని నెలల ముందు ఫోటోలు డిలీట్ చేసి హింట్ ఇచ్చిందని ఈమె కూడా త్వరలో విడాకులు తీసుకుంటుందనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం స్వాతి షూటింగ్స్ లో బిజిబిజిగా ఉంది. భర్త వికాస్ మాత్రం థాయ్ ల్యాండ్ లో ఉందని సమాచారం. మరి ఈ వార్తలపై స్వాతి ఎలా స్పందిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











