Heroine: హీరోయిన్‌ను దారుణంగా మోసం చేసిన స్టార్ డైరెక్టర్... కనీసం ఫోన్ కూడా ఎత్తకుండా?

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు కామన్. ఇక వారిని వాడుకుని వదిలేయడం కూడా సహజమే. అయితే తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. ఓ హీరోయిన్ తో ప్రేమను నడిపాడు. అంతా బాగుంది అనుకునే లోపే ఈ డైరెక్టర్ పెళ్లి చేసేసుకున్నాడు. ఏమైందో తెలియదు విడాకులు కూడా తీసుకున్నాడు. దానికి కారణం ఆ హీరోయిన్ అని అంతా అన్నారు. ఇప్పుడు ఆ హీరోయిన్ కాల్ కూడా ఎత్తడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

తెలుగు ఇండస్ట్రీలో ఆయన ఒక స్టార్ డైరెక్టర్. మంచి పేరు, క్రేజ్ అయితే ఉంది. ఆయన తీసిన సినిమాలు తక్కువే అయినప్పిటికీ.. స్టార్ డైరెక్టర్ కావడానికి ఎక్కువ సమయం అయితే పట్టేలేదనే చెప్పాలి. ఇక స్టార్ హీరోలు, హీరోయిన్లను తన కథలు చెప్పి.. సినిమాలకు ఒప్పించే సత్తా ఆయనకు ఉంది. ఇక మొదటి సినిమానే సందేశాత్మక సినిమా తీసి.. అందరి చేత వాహ్ అనిపించుకున్నారు. ఆయన తీసిన మొదటి సినిమాకు అవార్డులు సైతం వచ్చాయి.

 Telugu star director who cheated star heroine News Goes Viral

ఇక ఆ తర్వాత స్టార్ హీరోలతో సినిమాలు చేశాడు. తెలుగు ఇండస్ట్రీలో ఈ తరం హీరోలు, హీరోయిన్లతో ముగ్గురిని పెట్టి మల్టీ స్టారర్ తీశఆడు. ఇక ఆ సినిమా బాక్సాఫీస్ సూపర్ హిట్టుగా నిలిచింది. అవార్డులు కూడా లభించాయి. ఆ తర్వాత మళ్లీ మైథలాజికల్ మూవీస్ తీశాడు. అవి కూడా పర్వాలేదనిపించాయి. ఈయన సినిమాల్లో కచ్చితంగా ఓ సోషల్ మెసేజ్ మాత్రం ఉంటుంది. హీరో ఇమేజ్, హీరోయిన్ ఇమేజ్ కచ్చితంగా పెరుగుతుంది.

ఇక ఆయన తీసిన చివరి సినిమా మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. కానీ ఆ సినిమాలోని ఓ పాటకు జాతీయ అవార్డు వచ్చింది. ఇక ఆయన తీసిన అన్ని సినిమాలు కమర్షియల్ గా హిట్ అయ్యాయి. ప్రస్తుతం ఆయన ఓ స్టార్ హీరోతో కలిసి పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ఎప్పుడో మొదలైనప్పటికీ.. ఆ స్టార్ హీరో బిజీ ఉండటం వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఇక నెక్ట్స్ ఏడాది ఆయన ఈ సినిమా పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ డైరెక్టర్ అప్పట్లో ఓ హీరోయిన్ ప్రేమలో పడిపోయినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇక ఆ హీరోయిన్ తో బంధం గురించి రాస్తూ.. మీడియాలో కథనాలు కూడా వెలువడ్డాయి. కట్ చేస్తే.. ఆయన సడెన్ గా పెళ్లి చేసుకున్నారు. ఇక ఇటీవల ఈ డైరెక్టర్ విడాకులు తీసుకున్నారని తెలుస్తోంది. దీనంతటికి కారణం ఆ హీరోయిన్ అని తెలుస్తోంది. వారి వైవాహిక జీవితంలోకి ఈ హీరోయిన్ ఎంటర్ అవ్వడం వల్లే ఇలా అయిందని నెట్టింట చర్చ నడుస్తోంది.

ఇంతా జరిగాకా.. ఇప్పుడు ఆ హీరోయిన్ ను ఈ డైరెక్టర్ మోసం చేశారని తెలుస్తోంది. ఆమెకు అవకాశాలు కల్పిస్తానని చెప్పి.. ప్రేమలో మునిగి తేలిన ఈ డైరెక్టర్.. ఇప్పుడు కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదని తెలుస్తోంది. ఈ భామకు టాలీవుడ్ లో అసలే ఛాన్సులు లేవట. ఇప్పుడు డైరెక్టర్ హ్యాండ్ ఇవ్వడంతో దిక్కు తోచక స్థితిలో ఉందని టాక్. బాలీవుడ్ వెళ్లినా.. అక్కడ కూడా ఛాన్సులు లేవని తెలుస్తోంది. ఈయన గారు పాన్ ఇండియా సినిమా చేస్తున్నప్పటికీ.. ఈమెకు ఛాన్స్ ఇవ్వకుండా మరో హీరోయిన్ కు ఇచ్చారు. దీంతో ఆ హీరోయిన్ కాల్ చేసినా కూడా.. పట్టించుకోవడం లేదట. మరి చూడాలి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X