twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విషాదం: టెంపర్-పటాస్ ఆడియో ఫంక్షన్లు లేనట్లే?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: హరికృష్ణ పెద్ద కుమారుడు, సినీ నిర్మాత అయిన నందమూరి జానకిరామ్ యాక్సిండెటులో మరణించడంతో నందమూరి ఫ్యామిలీ, అభిమానులు విషాదంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెలలో జరుగాల్సిన ‘టెంపర్', ‘పటాస్' ఆడియో ఫంక్షన్లు ఇక ఉండక పోవచ్చని తెలుస్తోంది. డైరెక్టుగా ఆడియోను మార్కెట్లోకి విడుదల చేస్తారని సమాచారం.

    సోదరుడు జానకిరామ్ మరణంతో జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ విషాదంలో మునిగి పోయారు. ఈ నేపథ్యంలో జూ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్' ఆడియో ఫంక్షన్, కళ్యాణ్ రామ్ నటిస్తున్న ‘పటాస్' ఆడియో ఫంక్షన్లు ఉండక పోవచ్చని నందమూరి అభిమానుల్లో చర్చ సాగుతోంది.

    Temper, Pataas Audio Functions Has been canceled?

    హైదరాబాద్ నుండి విజయవాడ వెలుతుండగా....నల్లగొడ జిల్లా మునగాల మండలం, ఆకుపాముల దగ్గర జాతీయ రాహదారిపై యూటర్న్‌ తీసుకుంటున్న ట్రాక్టర్‌ను, జానకిరాం ప్రయాణిస్తున్న టాటా సఫారీ(ఎపీ29బీడీ2323) బలంగా ఢీకొంది. ఈ సంఘటనలో జానకి రామ్ అక్కడిక్కడే మరణించిన సంగతి తెలిసిందే.

    కాగా....గతంలో జూ ఎన్టీఆర్ 2009 ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తూ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అదృష్ట వశాత్తూ ఎన్టీఆర్ ప్రాణాలు దక్కాయి. అప్పట్లో ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం జరగిన ప్రాంతంలోనే జానకి రామ్ కారు ప్రమాదానికి గురి కావడం గమనార్హం. ఈ విషయం నందమూరి అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది.

    English summary
    Film Nagar source said that, Jr NTR's Temper, Nandamuri Kalyan Ram's Pataas Audio Functions Has been canceled. The entire Nandamuri family is now mourning the death of Harikrishna’s eldest son Janakiram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X