Devara: ఎన్టీఆర్ సినిమాలో మరో తారక్.. ఎవరూ ఊహించని పాత్రతో అరాచకం
పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'టెంపర్' మూవీ నుంచి వరుస పెట్టి హిట్లు మీద హిట్లు కొడుతూ డబుల్ హ్యాట్రిక్‌ను ఖాతాలో వేసుకున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దీనికితోడు RRR చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గానూ ఎదిగిపోయాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు తారక్ తన 30వ చిత్రం 'దేవర'ను చేస్తున్నాడు. టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్ అయిన కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లోనే రూపొందుతోంది. కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు.
పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ రూపొందిస్తోన్న 'దేవర' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత మార్చి నెలలోనే మొదలు పెట్టారు. ఆ వెంటనే దీనికి సంబంధించిన రెండు భారీ యాక్షన్ షెడ్యూళ్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మూడో దాన్ని కూడా ప్లాన్ చేసుకున్నారు. ఇలా వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేయాలని చిత్ర యూనిట్ చాలా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో ఓ రేంజ్‌లో చక్కర్లు కొడుతోంది.

ఐదు భాషల్లో రూపొందుతోన్న 'దేవర' మూవీలో పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను తీసుకున్నారు. ఇలా ఇప్పటికే చాలా మంది పేర్లు కూడా రివీల్ చేశారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో కన్నడ నటుడు, కేజీఎఫ్ ఫేం తారక్ పొన్నప్ప కూడా నటిస్తున్నాడట. ఇప్పటికే అతడు కొన్ని రోజుల పాటు షూటింగ్‌లో కూడా పాల్గొన్నాడని తెలిసింది. అంతేకాదు, ఈ సినిమాను తారక్ ఎవరూ ఊహించని ఓ పవర్‌ఫుల్ పాత్రను చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో అతడి పాత్రపై అంచనాలు క్రమంగా పెరిగిపోతూనే ఉన్నాయి.
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా చేస్తోన్న ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి యంగ్ సెన్సేషన్ అనిరుథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో జాన్వీ హీరోయిన్ కాగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీని 2024 ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు.


Click it and Unblock the Notifications











