Ram Charan RC15లో పవర్ ఫుల్ విలన్ గా స్టార్ హీరో.. శంకర్ నెక్ట్స్ లెవెల్ స్కెచ్.. ఇక బీభత్సమే!

ఇప్పుడు ఒక సినిమా ప్రాంతీయ చిత్రంగా కాకుండా ఎల్లలు దాటి గ్లోబల్ మూవీగా అవతరిస్తోంది. ఇంతకుముందు ఒక భాషకు చెందిన హీరోలతో అదే లాంగ్వేజ్ టెక్నీషియన్స్ పని చేశారు. ముఖ్యంగా హీరోలు, దర్శకులు వారి ప్రాంతీయ భాష చిత్రాలనే తెరకెక్కించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది.

వివిధ భాషలకు చెందిన టెక్నీషియన్స్, హీరోలు, దర్శకులు మరో లాంగ్వెంజ్ నటీనటులతో సినిమాలు రూపొందిస్తున్నారు. అలా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తెరకెక్కిస్తున్న సినిమా RC15. ప్రస్తుతం ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా సౌత్ కు చెందిన ఓ స్టార్ హీరో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రశంసలు..

ప్రశంసలు..

స్వయంకృషితో ఎదిగి మెగాస్టార్ అయిన చిరంజీవి నట వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. డ్యాషింగ్ డైరెక్టర్ దర్శకత్వం వహించిన చిరుత సినిమాతో తెలుగు తెరపై తెరగేంట్రం చేసి మెగా పవర్ స్టార్ గా ఎదిగాడు. ఇక ఇటీవల RRR సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. చెర్రీ నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు కొనియాడటమే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం దక్కాయి. ఆ తర్వాత చిరు-చెర్రీ కాంబినేషన్ లో వచ్చిన ఆచార్య మాత్రం పెద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

పకడ్బందీగా..

పకడ్బందీగా..

చిరంజీవి-రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారనడంతో ఆచార్య మూవీపై హైరేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. అయితే అభిమానులు, ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో ఆచార్య లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక RRRతో హిట్ కొట్టి, ఆచార్యతో ఫ్లాప్ మూటగట్టుకున్న రామ్ చరణ్ తన తర్వాతి సినిమాను చాలా పకడ్బందీగా ఉండాలనుకున్నట్లు తెలుస్తోంది. అందుకే కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

క్రేజీ టైటిల్స్..

క్రేజీ టైటిల్స్..

లెజండరీ దర్శకుల్లో ఒక్కరైన శంకర్ తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం RC15. ఈ సినిమాకు టైటిల్ ఏమని పెడతారా అని సౌత్ ప్రేక్షకులు ఒకరకమైన క్యూరియాసిటీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఈ చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపించాయి. వాటిలో నాలుగు, ఐదు క్రేజీ టైటిల్స్ ను చిత్రబృందం అనుకున్నట్లుగా టాక్ నడిచింది. అయితే వాటిలో ఒకరికి ఒకటి నచ్చితే ఇంకొకరకి మరో పేరు నచ్చుతుందని సమాచారం.

ఫైనల్ గా ఆ టైటిల్..

ఫైనల్ గా ఆ టైటిల్..

శంకర్, రామ్ చరణ్, కియారా అద్వానీ కాంబినేషన్ లో వస్తున్న RC15 చిత్రానికి పరీశీలనలో అనేక పేర్లు ఉన్నాయి. అయితే వాటిలో RC15 4 టైటిల్స్ రిజిస్టర్ చేశారట. అందులో సేనాని, సేనాపతి, సీఈవో, సైనికుడు ఉన్నాయట. అంతకుముందు సర్కారోడు, సీఎం కామన్ మ్యాన్, సిటిజన్ వంటి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ వీటన్నింటిలో ఫైనల్ గా సీఈవో (CEO) అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది.

చెర్రీ బర్త్ డే సందర్భంగా..

చెర్రీ బర్త్ డే సందర్భంగా..

RC15 టైటిల్ పోస్టర్ ను మెగా పవర్ స్టార్, గ్లోబల్ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న అనౌన్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే తెలుగు, తమిళ తోపాటు మిగతా భాషల్లో పాన్ ఇండియాగా వస్తున్న శంకర్, రామ్ చరణ్ RC15 సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో కోలీవుడ్ స్టార్ హీరో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అది ఎవరో కాదు ఇటీవల తెగింపు చిత్రంతో హిట్ కొట్టిన తలా అజిత్ కుమార్.

శంకర్ ఒప్పించాడని..

శంకర్ ఒప్పించాడని..

అయితే RC15లో అజిత్ కుమార్ విలన్ గా నటించడం అనేది ఇది రూమర్ అని కొందరు అంటుంటే.. సినిమాలో విలన్ గా నటించేందుకు అజిత్ ను శంకర్ ఒప్పించారని మరికొందరు అంటున్నారు. ఇదే నిజం అయితే హీరోగా సత్తా చాటిన అజిత్ తన విలనిజంతో ఫ్యాన్స్, సౌత్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయగలడనే భావన ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే ఇంతకుముందు కొన్ని చిత్రాల్లో నెగెటివ్ పాత్రలతో అదరగొట్టాడు. ఇప్పుడు ఆయన ఇందులో విలన్ గా నటిస్తే ఇక బీభత్సమే అని టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X