సినీ నటి రోజాకు స్టార్ హీరో బిగ్ షాక్

సినీ నటి రోజా సెల్వమణికి వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఎన్నికల్లో దారుణమైన ఓటమి పొందిన తర్వాత ప్రతీది ఆమెకు ప్రతికూలంగా మారిపోతున్నది. ఆమె అనేక వివాదాల్లో కూరుకుపోతున్నారు. సోషల్ మీడియాలో ఆమె ట్రోల్స్‌తో ముందుకు సాగుతున్నారు. మాజీ మంత్రి రోజకు ప్రతీ వీషయంలో చుక్కెదురు అవుతున్నదనే విషయం సినీ, రాజకీయ వర్గాల చర్చనీయాంశమవుతున్నది. తాజాగా ఓ స్టార్ హీరో రిజెక్ట్ చేసిన విషయంలోకి వెళితే..

గత ఐదేళ్లలో రోజా ఏపీ మంత్రిగా ఓ వెలుగు వెలిగింది. అయితే మంత్రిగా వెలిగిన సమయంలో పవన్ కల్యాణ్, చంద్రబాబుపై నోటికి వచ్చినట్టు విమర్శలు, ఆరోపణలు చేశారు. వ్యక్తిగతంగా దూషిస్తూ చిరంజీవిని కూడా వదల్లేదు. దాంతో ఆమపై అన్ని వర్గాల నేతల అభిమానుల, కార్యకర్తలు ఆమెపై ఘాటుగా స్పందించారు.

Thalapathy Vijay rejects Roja Selvani proposal to Join in Tamizhaga Vetri Kazhagam party in Tamilnadu

ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నిజయోకవర్గంలో సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర అసమ్మతిని ఎదుర్కొన్నది. ఓటింగ్ ప్రక్రియ ముగియక ముందే ఆమె సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ నేతల తనను ఓడించడానికి ప్రయత్నించారు అని సంచలన కామెంట్లు చేశారు. ఆమె స్వయంగా ఊహించినట్టే దారుణమైన ఓటమిని మూటగట్టుకొన్నారు.

నగరిలో ఓటమి తర్వాత రోజాపై శాప్ క్రీడల్లో భారీ అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఆమెపై క్రీడా సంఘాల అధికారులు కేసు నమోదు చేశారు. దాంతో ఆమె మెడకు సుమారుగా 100 కోట్ల అవినీతి ఆరోపణలు చుట్టుకొన్నాయి. ఈ క్రమంలో ఏపీ నుంచి తమిళనాడుకు మకాం మార్చారు. తమిళనాడులో విజయ్ స్థాపించిన కొత్త పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేశారు.

Thalapathy Vijay rejects Roja Selvani proposal to Join in Tamizhaga Vetri Kazhagam party in Tamilnadu

అయితే రోజా చేసిన ప్రయత్నాలను విజయ్ పార్టీ కీలక నేతలు తోసి పుచ్చారనేది తమిళ, తెలుగు మీడియాలో ఓ వార్త విస్తృతంగా ప్రచారం అవుతున్నది. విజయ్ దృష్టికి తీసుకెళ్లగా.. వివాదాస్పద నటిని చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. అంతేకాకుండా ఆమెపై అవినీతి ఆరోపణలు ఉండటంతో ఆమె అభ్యర్థనను తోసిపుచ్చారనే విషయం మీడియాలో వైరల్ అవుతున్నది.

ఇదిలా ఉండగా, రాజకీయాలకు దూరంగా ఉంటున్న రోజాకు ప్రస్తుతం సినిమాలో కూడా ఆఫర్లు లేకపోవడం, అలాగే జబర్దస్త్‌లో కూడా అవకాశం లేకపోవడం గడ్డు పరిస్థితిగా మారిందని సినీ, రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రోజా ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X