twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వంశీతో సినిమాకి విజయ్ షాకింగ్ రెమ్యునరేషన్.. దిల్ రాజు కూడా సై.. కానీ!

    |

    ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలకు భాషా భేదాలు లేకుండా పోతున్నాయి. ఒక్కో హీరోకు తమ అ మాతృభాష సహా ఇతర భాషలలో కూడా మార్కెట్ ఏర్పడుతూ ఉండడంతో ఆయా హీరోలతో పాన్ ఇండియా సినిమాలు చేయడానికి అన్ని భాషల నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ ఒక సినిమా చేయబోతున్నాడు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం విజయ్ భారీ ఎత్తున రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.

    సూపర్ కాంబో

    సూపర్ కాంబో

    తమిళ సూపర్ స్టార్, అక్కడి అభిమానులు ఇళయ తలపతిగా పిలుచుకునే విజయ్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా, దిల్ రాజు నిర్మాణంలో భారీ ప్రాజెక్ట్ రూపొందనుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. విజయ్ ఇప్పటిదాకా దాదాపు చాలా తమిళ సినిమాలు చేశారు తమిళంలో స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు..

    రెండు భాషల మార్కెట్లు

    రెండు భాషల మార్కెట్లు

    దాదాపు చానాళ్ళ నుంచి ఆయన చేస్తున్న అన్ని తమిళ సినిమాలు తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఆయనతో డైరెక్ట్ తెలుగు సినిమా ఒకటి చేస్తే తెలుగు ఆడియన్స్ తో పాటు తమిళ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారని దిల్ రాజు భావిస్తున్నారు. అందుకే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ తో ఆయన ఒక సినిమా ప్లాన్ చేసారని కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది.

     తెలుగులో మొదటి డైరెక్ట్ సినిమా

    తెలుగులో మొదటి డైరెక్ట్ సినిమా

    తమిళంలో ఇప్పటికే ఆయన స్టార్ హీరో అయినా తెలుగులో ఇదే మొదటి డైరెక్ట్ సినిమా కావడంతో ఆయన కెరీర్లో ఈ చిత్రం మరో మైలురాయిలా నిలిచేలా చేయాలని ప్లాన్ చేస్తున్నారట దిల్ రాజు. అందుకే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే దిల్ రాజు శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్లో ఒక సినిమా చేస్తున్నారు. దాదాపు అంతే బడ్జెట్ తో ఈ సినిమా కూడా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

    కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్

    కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్

    ఇక ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా తాజాగా విజయ్ రెమ్యూనరేషన్ విషయం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ప్రస్తుతం విజయ్ ఒక సినిమా చేయడానికి 80 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నాడు. అయితే దిల్ రాజు ఈ చిత్రానికి విజయ్ కు అంతకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ను ఆఫర్ చేశాడని అంటున్నారు. ఈ చిత్రానికి విజయ్ కు పారితోషికంగా 90 కోట్లు ఇస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా మొత్తం బడ్జెట్ 170 కోట్లకుపైగానే అవుతుందని అంటున్నారు.

    Recommended Video

    Vijay Devarakonda Birthday : టాలీవుడ్‌లోనే ఏకైక హీరోగా రికార్డు | Liger Teaser || Filmibeat Telugu
    అంత వర్కౌట్ అవుతుందా

    అంత వర్కౌట్ అవుతుందా

    నిజానికి వంశీపైడిపల్లి కి మంచి సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు తీస్తాడు అనే పేరుంది. అయితే ఆయన చివరిగా తీసిన మహర్షి అంతకుముందు చేసిన ఊపిరి సినిమాలు మాత్రం ప్రేక్షకులను మెప్పించినా సరే కమర్షియల్గా మాత్రం పెద్దగా సక్సెస్ కాలేదని అంటున్నారు. అలాంటిది ఇప్పుడు వంశీ పైడిపల్లి, విజయ్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రానికి దిల్ రాజు ఇంత ఖర్చు పెడతాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి చూడాలి ఏం జరుగుతుందో.

    English summary
    There are some speculations going on that Tamil star hero Vijay a and Vamsi paidipally are doing a film under Dil Raju production. now some reports states that For Thalapathy Vijay Tollywood Debut Star Producer Dil Raju Offered Whopping 90 CRORES Remuneration. and Total Movie Budget Will Shoot up to around 170 CRORES and movies to be Directed By Vamshi Paidipally. and sources say that Official Announcement will be out Soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X