తమన్‌కు దక్కని ‘సైరా’ ఛాన్స్, సుతిమెత్తగా చెప్పిన రామ్ చరణ్!
Recommended Video

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సైరా నరసింహా రెడ్డి' సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ సినిమా అఫీషియల్‌గా ప్రకటించిన తర్వాత మెయిన్ టెక్నీషియన్స్ విషయంలో చాలా మార్పులు జరిగాయి. ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా మొదట రవివర్మన్‌ను అనుకున్నారు. అయితే పలు కారణాలతో ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో రత్నవేలు వచ్చారు.
'సైరా'కు సంగీతం అందించేది ఏఆర్ రెహమాన్ అని మొదట ప్రకటించినప్పటికీ వేరే కమిట్మెంట్స్ వల్ల ఈ ప్రాజెక్ట్ తాను చేయలేక పోతున్నాను అని రెహమాన్ స్వయంగా తెలిపారు.

తమన్ అంటూ ప్రచారం నిజం కాదా?
రెహమాన్ స్థానంలో ‘సైరా' ప్రాజెక్టులోకి తమన్ వచ్చే అవవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ‘సైరా' మోషన్ పోస్టర్ కు తమన్ అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ అందించడంతో ఇది నిజమే అని అంతా అనుకున్నారు. అయితే తమన్ సంగీతం అందించే అవకాశం లేదని తాజా సమాచారం.

తమన్ స్థాయి సరిపోదని రామ్ చరణ్ అభిప్రాయం?
‘సైరా నరసింహారెడ్డి' అనేది 150 కోట్ల ప్రాజెక్ట్. నేషనల్ లెవల్లో చేస్తున్న ప్రతిష్టాత్మక సినిమా. ఇలాంటి సినిమాకు తమన్ స్థాయి సరిపోదని నిర్మాత రామ్ చరణ్ భావిస్తున్నారట.

నెక్ట్స్ మూవీ ఛాన్స్ ఇస్తానన్న చరణ్
‘సైరా' విషయంలో తాను రిస్క్ చేయలేనని, తాను హీరోగా చేసే తర్వాతి సినిమాకు చాన్స్ ఇస్తానని తమన్‌కు సుతిమెత్తగా చెప్పారట చెర్రీ. తమన్ గతంలో చెరణ్ నటించిన ‘బ్రూస్ లీ' చిత్రానికి సంగీతం అందించారు.

తెరపైకి కీరవాణి పేరు కూడా?
బాహుబలి సినిమాకు సంగీతం అందించిన కీరవాణి పేరు కూడా ఇటీవల తెరపైకి వచ్చింది. అయితే ఈ విషయంలో చిత్ర యూనిట్ నుండి ఎలాంటి సమాచారం లేదు. ‘సైరా’కు సంగీతం ఎవరు అనే విషయమై చిత్ర యూనిట్ నుండి అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











