twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ దూకుడులో కూడా ఒక్కటే స్టైల్..!?

    By Sindhu
    |

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాల నటుడిగా తన సినీ కెరీర్ ను ప్రారంభించిన నటుడు మహేస్, ఆ తర్వాత మహేష్ హీరోగా పరిచయమైన సినిమా నుండి నేటి 'ఖలేజా" సినిమా వరకు కూడా అన్నిమంచి విజయమే సొంతం చేసుకున్నాయి. అయితే మహేష్ నటించిన అన్ని చిత్రాలు కూడా మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాయి. అప్పటి 'రాజకుమారుడు", 'మురారి" నుండి ఇటీవలే వచ్చిన 'ఖలేజా" వరకు కూడా వచ్చిన మహేష్ చిత్రాలలోని పాటలు..మహేష్ సినీ కెరీర్ లోనే సూపర్ హిట్ సాంగ్స్ గా నిలిచాయి. అయితే మహేష్ నటించిన తాజా చిత్రం 'దూకుడు" సాంగ్స్ ఇప్పటి వరకు కూడా ఇలాంటి పాటలు, మహేష్ సినీ కెరీర్ లోనే చాలా చెత్తగా ఉన్న పాటలుగా చెప్పుకోవచ్చు

    థమన్ కు అగ్ర హీరోల చిత్రాలకు సంగీతం అందించే అవకాశాలు వస్తున్నప్పటికీ, వాటిని సరైన రీతిలో ఉపయోగించుకోకుండా..పాడిందే పాడుతూ బోరికొట్టించేస్తున్నాడు. తెలుగులో తన తొలి చిత్రం 'కిక్" నుండి నేటి 'దూకుడు" చిత్రం వరకు కూడా థమన్ ఒక్కటే స్టైల్ ను ఫాలో అవుతుండడంతో జనాలకు థమన్ మ్యూజిక్ వింటేనే విరక్తి కలుగుతుంది. అలాంటి థమన్ ను మహేష్ తన తదుపరి చిత్రం'ది బిజినెస్ మ్యాన్"లోనూ సంగీతం అందించే అవకాశం కల్పించినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే మహేష్ కెరీర్ లో 'దూకుడు" తర్వాత అట్టర్ ప్లాప్ మ్యూజికల్ ఆల్బంను సొంతం చేసుకునే మరో చిత్రంగా బిజినెస్ మ్యాన్ ఉండబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

    అభిమానుల నుండి దూకుడు ఆడియోకు కోల్పొతున్న స్పందనను మహేష్ త్వరగా తెలుసుకొని, తన తదుపరి చిత్రానికి ఇలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా జాగ్రత్త వహిస్తాడని ఆశిధ్దాం....

    English summary
    The clock is ticking for the long pending and much awaited movie Dookudu to hit the screens. The report from cine folks is The composition by Thaman is good and the tunes are decent. But the problem is with the mixing. There is so much noise in the audio that the words and the feel of the songs has gone missing. In one line, Thaman has murdered Dookudu due to his poor mixing.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X