Akhanda: ఫ్యాన్స్‌లో జోష్‌ను నింపిన థమన్.. ఇదే ఇలా ఉంటే సినిమాలో ఎలా ఉంటదో!
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్‌లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. సినిమాలు హిట్ అయిన కారణంగానో.. మరేదో రీజన్ వల్లో ఆయా స్టార్ల కలయికలో సినిమాలు రావాలని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబినేషన్‌లలో టాలీవుడ్ బడా హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయిక ఒకటి. గతంలో వీళ్లిద్దరి కాంబోలో 'సింహా', 'లెజెండ్' వంటి రెండు భారీ సక్సెస్‌లు రావడమే. ఈ మూవీలు బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచాయి. అందుకే వీళ్ల కలయిక ఎంతో స్ఫెషల్ అని అంటుంటారు.
రెండు విజయవంతమైన సినిమాల తర్వాత బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమే 'అఖండ'. చాలా రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. కానీ, అనివార్య కారణాల వల్ల చిత్రీకరణ భాగం మాత్రం ఇప్పటి వరకూ పూర్తి కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సెకెండ్ వేవ్ తర్వాత ఇటీవలే షూట్‌ను పున: ప్రారంభించారు. ఆ వెంటనే పలు షెడ్యూళ్లను కంప్లీట్ చేశారు. ఇలా ఇటీవలే ఈ మూవీ షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. దీంతో ఈ సినిమా విడుదలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కొన్ని పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి.

'అఖండ' మూవీ విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయాలని భావిస్తోంది. దీంతో ఈ చిత్రం నుంచి ఒక్కో పాటను విడుదల చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశాడు. ఇందులో రెండు గ్రూపులుగా ఉన్న సింగర్లు ఓ శ్లోకాన్ని ఆలపిస్తున్నారు. ఇదే అఖండ బ్యాగ్రౌండ్ స్కోర్ అని థమన్ పేర్కొన్నాడు. దీంతో మామూలుగానే ఇలా ఉంటే థియేటర్లలో ఇది దద్రిల్లిపోతుందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
నందమూరి బాలకృష్ణ కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'అఖండ' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగా ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకూ పలు టీజర్లు విడుదల అయ్యాయి. వీటికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. మరీ ముఖ్యంగా టైటిల్ రోర్ వీడియోకు రికార్డు స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ వీడియో తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. అదే సమయంలో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగినట్లు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
సూపర్ హిట్ కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'అఖండ'లో నందమూరి బాలకృష్ణ అఘోరాగా, పవర్‌ఫుల్ రైతుగా రెండు పాత్రలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ కూడా పూర్తైందని తెలుస్తోంది. ఇక, ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పూర్ణ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేస్తోంది. ఫ్యామిలీ హీరోగా పేరొందిన శ్రీకాంత్ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ విడుదల తేదీ త్వరలోనే వెల్లడిస్తారని అంటున్నారు.


Click it and Unblock the Notifications











