Guntur karam: మహేశ్ నిర్ణయం కోసం థమన్ వెయిటింగ్.. ఒక్క సిగ్నల్ వస్తే పండగే
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం రూపొందుతోన్న భారీ చిత్రాల్లో 'గుంటూరు కారం' ఒకటి. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.
క్రేజీ కాంబినేషన్‌లో ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'గుంటూరు కారం' సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. కానీ, అనివార్య కారణాల వల్ల చిత్రీకరణ సజావుగా సాగడం లేదు. దీంతో ఈ సినిమాను అనుకన్న సమయానికి విడుదల చేసే అవకాశం లేదని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ఎన్నో కాంట్రవర్శీలూ హైలైట్ అవుతున్నాయి.

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తోన్న 'గుంటూరు కారం' మూవీకి థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, అతడిని దీని నుంచి తప్పిస్తున్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ, కొద్ది రోజుల క్రితం వచ్చిన గ్లింప్స్ వీడియోకు అతడు చక్కని బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వడంతో ఇదంతా పుకారే అని తేలింది. ఆ తర్వాత కూడా ఇలాంటి వార్తలే వైరల్ అవుతున్నాయి. ఇటీవలే థమన్ దీనిపై క్లారిటీ ఇచ్చినా పుకార్లు మాత్రం ఆగడం లేదు.
'గుంటూరు కారం' మూవీ నుంచి థమన్‌ను తీసేశారని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా అతడు ఓ అదిరిపోయే సాంగ్‌ను కంప్లీట్ చేసి వెకేషన్‌లో ఉన్న మహేశ్ బాబుకు పంపించాడట. అతడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఈ పాటకు సంబంధించిన ప్రకటన చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలిసింది. అలా చేయడం వల్ల థమన్ గురించి క్లారిటీ ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు అందరూ మహేశ్ నిర్ణయం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇదిలా ఉండగా.. 'గుంటూరు కారం' సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్లుగా చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం ఇస్తున్నాడు. ఇందులో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











