300 కోట్లతో అల్లు అరవింద్ భారీ సినిమా.. అల్లు అర్జున్ తో కాకుండా ఆ స్టార్ హీరోతో!

ఇప్పుడు మారుతున్నా ట్రెండ్ లో పాన్ ఇండియా లెవెల్లో అనేక చిత్రాలు భారీ బడ్జెట్ లు ఉహించని కాంబినేషన్ లతో నిర్మాతలు తీసుకొస్తున్స్ సంగతి తెలిసిందే. కాగా ఒకో భాష నుంచి ఒకో భాషకి చెందిన హీరోలు దర్శకులు సహా నిర్మాతలు సైతం ఆడియెన్స్ కి ట్రీట్ ఇచ్చేలా భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు. కాగా మన తెలుగు సినిమా కూడా ఈ కొన్నేళ్లలో ఎంత పరిణితి చెందింది అనేది కూడా అందరికీ తెలిసిందే.

ఇలా మన తెలుగు సినిమా నుంచి కూడా ఎన్నో సినిమాలు భారీ బడ్జెట్ లు సాలిడ్ కాంబినేషన్ లతో వస్తున్నాయి. కాగా ఇపుడు టాలీవుడ్ లో సీనియర్ అండ్ స్టార్ దర్శకులు రాజమౌళి, సుకుమార్ లాంటి వారు మాత్రమే కాకుండా కొత్త కొత్త సబ్జెక్టు లతో యువ దర్శకులు కూడా తమ సత్తా చాటుతూ ఉండడంతో మన సీనియర్ నిర్మాతలు కూడా ఈ యంగ్ జెనరేషన్ ని తీసుకొని బిగ్ స్టార్స్ తో సినిమాలు చేసుకునే ప్లాన్ లు చేసుకుంటున్నారు.

thandel director Chandoo mondeti gets massive offer from allu aravind with worth 300 crore project

ఇలానే తెలుగు సినిమాలో మోస్ట్ వాంటెడ్ అండ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కూడా ఒకరు. ఒక స్టేజిలో ఉన్న డబ్బులు అంతా ఒకే సినిమా మీద పెట్టి రిస్క్ చేసిన తాను ఇపుడు ఏకంగా 300 కోట్ల బడ్జెట్ ని ఒక యువ దర్శకునికి ఆఫర్ చేసినట్టుగా ఇపుడు సినీ వర్గాల్లో టాక్ వైరల్ గా మారింది. కాగా ఆ దర్శకుడు కూడా ఎవరో కాదట.

తెలుగు ఆడియెన్స్ కి సాలిడ్ థ్రిల్లర్స్ కార్తికేయ 1, కార్తికేయ 2 లు అందించిన దర్శకుడు చందూ మొండేటి అట. మరి ఈ యువ దర్శకునికి తన కార్తికేయ 2 చూసి ఏకంగా 300 కోట్ల ప్రాజెక్ట్ ని కొన్నాళ్ల కితం ఆఫర్ చేసినట్టుగా లేటెస్ట్ గా యంగ్ దర్శకుడు రివీల్ చేసాడు. ఇంట్రెస్టింగ్ గా ఎలాంటి సినిమా అయినా పర్వాలేదు బడ్జెట్ 300 కోట్లు అంతకంటే ఎక్కువే పెడతాను అని కూడా అల్లు అరవింద్ లాంటి దిగ్గజ నిర్మాత ఈ యువ దర్శకుణ్ణి నమ్మరాట.

thandel director Chandoo mondeti gets massive offer from allu aravind with worth 300 crore project

అంతే కాకుండా తన ఇంట్లోనే పాన్ ఇండియా హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నప్పటికీ ఈ సినిమాని తమిళ స్టార్ హీరో సూర్య లేదా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లతో చేయాలని అల్లు అరవింద్ సూచించినట్టుగా తాను తెలిపాడు. కాగా ఈ యంగ్ దర్శకునికి ఈ రేంజ్ ప్రాజెక్ట్ ని ఆఫర్ చేయడం ఒకెత్తు అయితే తన కొడుకు ఉన్నప్పటికీ మిగతా హీరోస్ తో చేయమని చెప్పడం అనేది ఇంకొక ఎత్తు అని చెప్పాలి.

అయితే గీతా ఆర్ట్స్ దగ్గర సూర్య, రామ్ చరణ్ ల డేట్స్ ఉండడంతో చందూకి వారిలో ఎవరితో అయినా సెట్ అయ్యే భారీ ప్రాజెక్ట్ చేయాలని చెప్పారట. మరి ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఎంతవరకు సాధ్యం అవుతుందో చూడాలి మరి. ఇప్పుడు అయితే ఇదే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో నాగ చైతన్యతో చందూ మొండేటి తెరకెక్కించిన భారీ చిత్రం తండేల్ రిలీజ్ కి రాబోతుంది. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి నటించగా పాన్ ఇండియా లెవెల్లో ఈ ఫిబ్రవరి 7న విడుదల కాబోతుంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X