»   » గ్రీన్ సిగ్నల్ : రామ్ చరణ్ సరసన సమంత

గ్రీన్ సిగ్నల్ : రామ్ చరణ్ సరసన సమంత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ సరసన సమంతను నటింపచేయాలని ఎవడు, బ్రూస్ లీ చిత్రాల సమయంలో అనుకోవటం జరిగింది. అయితే రకరకాల కారణాలతో అవి మెటీరియలైజ్ కాలేదు. అయితే ఇప్పుడు మూడో సారి ఈ కాంబినేషన్ సెట్ చేయటానికి సన్నాహాలు మొదలయ్యినట్లు సమాచారం. అయితే ఈ సారి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రామ్ చరణ్ తాజాగా "తని ఒరువన్" చిత్రం రీమేక్ ని ఓకే చేసారు. ఈ చిత్రానికి సురేంద్ర రెడ్డి డైరక్షన్ చేయనున్నారు. ఈ చిత్రంలో నయనతార చేసిన పాత్రకు గానూ సమంత ను తీసుకోవాలని నిర్ణయంచుకున్నట్లు సమాచారం. అందుకు ఆమెను సంప్రదిస్తే...డేట్స్ ఇవ్వటానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సమంత..మహేష్ బాబు బ్రహ్మోత్సవం, నితిన్ ..అ ఆ చిత్రాలు చేస్తోంది. అలాగే విజయ్ తాజా చిత్రంలోనూ ఆమె చేయనుంది. ఇన్నిటి మధ్య ఎలా..రామ్ చరణ్ చిత్రానికి డేట్స్ కేటాయిస్తుందో చూడాలి.

Thani Oruvan Remake: Samantha for Charan again?

బ్రూస్ లీ మూవీతో ఆడియెన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చిన రామ్ చరణ్... ఈ సినిమా తరువాత కోలీవుడ్ హిట్ మూవీ 'తని ఒరువన్' రీమేక్ లో నటిస్తున్నారు. నిర్మాత దానయ్య ఈ హిట్ సినిమా రీమేక్ రైట్స్ ను రామ్ చరణ్ కోసమే భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేశాడని...ఈ ఏడాదిలోనే ఈ రీమేక్ మూవీ సెట్స్ మీదకు వెళ్లొచ్చని వినిపిస్తోంది. ఈ సినిమాకు మెగా ఫోన్ పట్టుకునేది సురేంద్రరెడ్డి అనే క్లారిటీ రావటంతో... హీరోయిన్ గా సమంత పేరు దాదాపుగా ఖరారైందని ప్రచారం మొదలైంది దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా హిట్టే అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.

రామ్ చరణ్ మాట్లాడుతూ...ఇదివరకు రీమేక్‌ సినిమాలు చేయకూడదు అనుకొనేవాణ్ని. కానీ అలాంటి నిబంధనలేవీ పెట్టుకోకూడదనే ఓ నిర్ణయానికొచ్చా. 'తని ఒరువన్‌' నాకు బాగా ఇష్టం. అందులో హీరో పాత్ర కంటే విలన్ పాత్ర చాలా ముఖ్యం. ఆ పాత్రకి తగ్గ నటుడు దొరికితే వెంటనే సినిమాని మొదలుపెడతాం. ఆ తర్వాత గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వంలోనూ ఓ సినిమాని చేయబోతున్నా. అదొక ప్రేమకథతో తెరకెక్కబోతోంది.

అలాగే...పవన్‌కల్యాణ్‌ నిర్మాణంలో సినిమా ఎప్పుడు చేయబోతున్నారు అంటే...ఇటీవలే నేను, బాబాయ్‌ కలిసి మాట్లాడుకొన్నాం. వచ్చే ఏడాది ఆ సినిమా ఉంటుంది.మీ నాన్న, మీ బాబాయ్‌, మీరు... ముగ్గురూ కలిసి నటించే అవకాశాలేమైనా ఉన్నాయా?అలాంటి కలయికలో సినిమా వస్తే బాగుంటుంది. కానీ ముగ్గురూ కలిసి నటించాలంటే అందుకు దీటైన కథ కావాలి. ఇప్పటిదాకా ఏ దర్శకుడూ అలాంటి ప్రతిపాదనతో మా దగ్గరికి రాలేదు. ఒకవేళ వస్తే, కథ బాగుంటే తప్పకుండా చేస్తాం అన్నారు.

English summary
Reports are coming out that actress Samantha has been roped for upcoming Telugu remake of Tamil movie "Thani Oruvan" under the direction of Surender Reddy.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu