»   »  రామ్ చరణ్ కు నో చెప్పినట్లే

రామ్ చరణ్ కు నో చెప్పినట్లే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చరణ్, శృతి హాసన్ కాంబినేషన్ లో గతంలో ఎవడు చిత్రం వచ్చి మంచి విజయం సాధించింది. గ్యాప్ తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ చేయాలని ప్లాన్స్ జరుగుతున్నాయి. అయితే శృతి హాసన్ అందుకు సముఖంగా లేదని తెలుస్తోంది.

సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో తమిళంలో విజయవంతమైన ' 'తని ఒరువన్‌'' చిత్రాన్ని తెలుగులో రామ్ చరణ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన శృతి హాసన్ ని అడిగారని సమాచారం. అయితే అందుతున్న సమచారాన్ని బట్టి తన వద్ద డేట్స్ లేవని తిరస్కరించినట్లు చెప్పుకుంటున్నారు. తాను నాగచైతన్యతో ప్రేమమ్ రీమేక్ చేయటం కోసం డేట్స్ ఇచ్చానని అందుకే నో చెప్పాల్సి వస్తోందని ఆమె చెప్పినట్లు వినపడుతోంది.

ఈ విషమయై తమిళ మీడియాతో శృతి హాసన్ మాట్లాడుతూ...తాను ప్రేమమ్ రీమేక్ తప్ప ఏ తెలుగు సినిమా చేయటం లేదని రీసెంట్ గా చెప్పుకొచ్చింది. ఈ నేపధ్యంలో తమిళంలో నయనతార చేసిన పాత్రకు ఎవరు ఇప్పుడు ఆప్షన్ అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మొత్తం హిందీ, కన్నడ, తెలుగు చిత్ర సీమలను తన వైపు తిప్పుకున్న ఆ చిత్రం పేరు 'తని ఒరువన్'. 'దృశ్యం' తర్వాత మళ్లీ ఓ హాట్ కేక్. మలయాళ 'దృశ్యం' ఇప్పటికే అయిదు భాషల్లో రీమేక్ అయి విజయం సాధించింది. మళ్లీ ఆ సినిమా తర్వాత 'తని ఒరువన్' హాట్ కేక్‌లా మారింది. అన్ని భాషల్లోనూ ఈ సినిమా రీమేక్ చేయాలని హేమాహేమీలు ప్లాన్ చేస్తున్నారు.

 Thani Oruvan Remake : Shruti Haasan no to Ram Charan

రామ్ చరణ్ మాట్లాడుతూ...ఇదివరకు రీమేక్‌ సినిమాలు చేయకూడదు అనుకొనేవాణ్ని. కానీ అలాంటి నిబంధనలేవీ పెట్టుకోకూడదనే ఓ నిర్ణయానికొచ్చా. 'తని ఒరువన్‌' నాకు బాగా ఇష్టం. అందులో హీరో పాత్ర కంటే విలన్ పాత్ర చాలా ముఖ్యం. ఆ పాత్రకి తగ్గ నటుడు దొరికితే వెంటనే సినిమాని మొదలుపెడతాం. ఆ తర్వాత గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వంలోనూ ఓ సినిమాని చేయబోతున్నా. అదొక ప్రేమకథతో తెరకెక్కబోతోంది.

తని ఒరువన్ కథేంటి... మిత్రన్ ('జయం' రవి), అతని స్నేహితులు ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్స్. డ్యూటీలో చేరక ముందే తమ కళ్ల ముందు జరుగుతున్న అన్యాయాలను ఎదిరిస్తూంటారు. మిత్రన్ ప్రేయసి మహిమ (నయనతార) కూడా వాళ్లతో చేతులు కలుపుతుంది. ఈ క్రమంలోనే ఓ సామాజిక కార్యకర్త వీళ్ల కళ్లముందే హత్యకు గురవుతాడు. ఇలాగే వరుస హత్యలు చోటుచేసుకుంటాయి. ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత హత్యలుగా వాళ్లు గుర్తిస్తారు.

ఫైనల్‌గా ఇదంతా ఫేమస్ సైంటిస్ట్ సిద్ధార్థ్(అరవింద స్వామి) చేస్తున్నాడని తెలుసుకుంటారు. చివరకు సిద్ధార్థ్ధ్‌ను వాళ్లు ఎలా ఎదిరించారన్నది మిగిలిన కథాంశం. తమిళంలో చివరి 'నెగటివ్' సినిమా! ఈ సినిమా ఇప్పటికే వసూళ్లు కొల్లగొడుతూంటే, మరో రూపంలో ఇది చరిత్రలో నిలిచిపోనుంది. తమిళంలో 'నెగటివ్' వాడిన చివరి సినిమా ఇదే.

English summary
Shruti Haasan said to Tamil media that she haven't signed any other film in Telugu except "Premam" remake with Naga Chaitanya.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu