అక్కినేని హీరోపై ఫోకస్ పెట్టిన తరుణ్ భాస్కర్
టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్లి చూపులు సినిమాతో ఒక ట్రెండ్ సెట్ చేసిన యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ రెండవ సినిమతో కూడా మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ నగరానికి ఏమైంది సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ప్రాఫిట్స్ ను అందించడమే కాకుండా ఇప్పటికి కూడా యూత్ కి అది ఫేవరేట్ మూవీ. సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన మీమ్స్ వైరల్ అవుతూనే ఉంటాయి.
అయితే దర్శకుడు ఎక్కడికి వెళ్లినా కూడా ఆడియెన్స్ అయితే ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 కావాలని కోరుకుంటున్నారు. ఆ కథ కూడా రావచ్చని అప్పట్లో దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం తరుణ్ భాస్కర్, నాగ చైతన్యతో కూడా సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు ఒక కొత్త గాసిప్ వైరల్ అవుతోంది.

అసలైతే ఈ దర్శకుడు నెక్స్ట్ సినిమాను వెంకటేష్ తో చేయాలని అనుకున్నాడు. త్వరలోనే స్పోర్ట్స్ డ్రామా రానుందని కూడా చెప్పాడు. ఇక వెంకీ F2తో పాటు దృశ్యం 2ను కూడా పట్టాలెక్కించాడు. కానీ తరుణ్ భాస్కర్ సినిమా ఇంకా మొదలవ్వలేదు. అయితే వెంకీ బిజీగా ఉండడం వల్ల దర్శకుడు ప్లాన్ చేంజ్ చేసినట్లు రూమర్స్ వస్తున్నాయి. నాగ చైతన్యకు సెట్టయ్యే విధంగా ఒక లవ్ స్టోరీని సెట్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఇక నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యు అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











