మహేష్ అభిమానులకు బెస్ట్ గిఫ్ట్ రెడీ.. ఈ న్యూ ఇయర్‌ వేడుకలు మోగిపోవాల్సిందే!

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు పండగ చేసుకునే ఓ వార్త బయటకొచ్చింది. ఆయన తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు గురించిన ఓ అప్‌డేట్ ఆసక్తికరంగా మారింది. ఈ సారి న్యూ ఇయర్‌ వేడుకలు దద్దరిల్లి పోయేలా మహేష్ టీమ్ స్కెచ్ వేసిందట. ఇంతకీ ఆ స్కెచ్ ఏంటి? మహేష్ అభిమానులు ఏ మేర పండగ చేసుకోవచ్చు? వివరాల్లోకి పొతే..

'సరిలేరు నీకెవ్వరు'లో ఐటెం సాంగ్

'సరిలేరు నీకెవ్వరు'లో ఐటెం సాంగ్

ప్రేక్షకలోకానికి పూనకం తెప్పించేలా 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో ఓ ఐటెం సాంగ్ ప్లాన్ చేశారట దర్శకనిర్మాతలు. ఇప్పటికే ఈ ఐటెం సాంగ్ చిత్రీకరణ కూడా జరిగిపోయిందని తెలుస్తోంది. ఇందులో మహేష్ బాబుతో పాటు పూజా హెగ్డే చిందులేసిందని ఫిలింనగర్ టాక్.

మహేష్ అభిమానులకు ఇదే బెస్ట్ గిఫ్ట్

మహేష్ అభిమానులకు ఇదే బెస్ట్ గిఫ్ట్

ఈ ఐటెం సాంగ్ కేకలు పెట్టించేలా మునుపెన్నడూ చూడని విధంగా ఫాస్ట్ బీట్‌తో అదరగ్గొట్టేస్తుందని లేటెస్ట్ సమాచారం. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా పరంగా చూస్తే మహేష్ బాబు అభిమానులకు ఇదే బెస్ట్ గిఫ్ట్ అని అంటోందట చిత్రయూనిట్. ఈ సాంగ్ విని థియేటర్స్‌లో ప్రేక్షకులు ఉగిపోవాల్సిందే అనే టాక్ వినిపిస్తోంది.

న్యూ ఇయర్‌ వేడుకలు.. మోగిపోవాల్సిందే మరి

న్యూ ఇయర్‌ వేడుకలు.. మోగిపోవాల్సిందే మరి

ఇక ఈ ఏడాది డిసెంబర్ ఎండింగ్, వచ్చే ఏడాది జనవరి స్టార్టింగ్ లో వచ్చే న్యూ ఇయర్‌ వేడుకల్లో ఈ పాటదే హంగామా అంతా అంటున్నారు కొందరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పాటతోనే న్యూ ఇయర్‌ సంబరాలు చేసుకుంటారని అంటున్నారు. అంటే ఈ లెక్కన ఈ సాంగ్ ఏ రేంజ్‌లో ఉండనుందో అర్థం చేసుకోవచ్చు. అతి త్వరలో ఈ సాంగ్ విడుదల కానుందని సమాచారం.

Recommended Video

CineBox: Chiranjeevi Imitates Pawan Kalyan | Ali Reza To Act In a Crazy Movie
సరిలేరు నీకెవ్వరు మూవీ

సరిలేరు నీకెవ్వరు మూవీ

అనిల్ రావిపూడి దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాగా 'సరిలేరు నీకెవ్వరు' మూవీ రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరిదశకు చేరుకుంది. చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ విజయశాంతి ముఖ్యపాత్ర పోషిస్తోంది. భారీ అంచనాల నడుమ జనవరి 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X