న్యూమరాలజి ఫాలో అయ్యే మహేష్ బాబు...
మహేష్ బాబు తాజా చిత్రం ది బిజెనెస్ మ్యాన్ చిత్రం విడుదల తేదీని ముందు అనుకన్నట్లు కాకుండా 11-01-12కి మార్చినట్లు సమాచారం. అందుకు కారణం న్యూమరాలిజీ అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఫస్ట్ లుక్ విడుదల తేదీని 11-11-11గా ఫిక్స్ చేసిన నిర్మాతలు రిలీజ్ కూడా తేదీ కలిసివచ్చేటట్లు పెడితే బెస్ట్ అని మహేష్ బాబు ని ఒప్పించారని తెలుస్తోంది. అయితే ప్రతీ విషయంలోనూ ప్రాక్టికల్ ఎప్రోచ్ తో ముందుకు వెళ్లే పూరీ జగన్నాధ్ కి ఈ విషయంలో పెద్దగా ఆసక్తి లేకపోయినా ఏ డేట్ అయినా సినిమాలో దమ్ము ఉంటే చాలని చెప్పి ఓకే అన్నట్లు చెప్పుకుంటున్నారు.
ఇక ఈ చిత్రం నేపధ్యం ముంబై మాఫియాలోని ఆయుధాల వ్యాపారం.. కొనుగోళ్ళు .. అమ్మకాల చుట్టూ తిరగనుందని తెలుస్తోంది.ముంబైలోనే ఎక్కువ బాగం షూట్ చేయాలని పూరీ భావిస్తున్నారు. గన్స్ నీడ్స్ నో ఎగ్రిమెంట్స్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం పూర్తిగా స్టైలిష్ గా సాగే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రం హిందీ వెర్షన్ ని కూడా పూరి రెడీ చేస్తున్నారు.హిందీ వెర్షన్ లో అబిషేక్ బచ్చన్ చేయనున్నారు.
ఈ విషయమై పూరీ మాట్లాడుతూ... తెలుగు, హిందీ వెర్షన్స్ రెండూ ఒకేలా ఎందుకుంటాయి. ఒకటి ప్రత్యేకంగా మహేష్ కోసం తెలుగు ఆడియన్స్ ఇష్టపడేలా డిజైన్ చేసింది. మరొకటి అభిషేక్ బాడీ లాంగ్వేజ్ ని దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్ ఆడియన్స్ కు నచ్చేలా చేసిన స్క్రిప్టు. అలాగే నేను తెలుగు వెర్షన్ కి రీమేక్ లాగ దీన్ని తీర్చిదిద్దదలుచుకోలేదు. అయితే రెండు చిత్రాలకు నేపధ్యం మాత్రం ముంబై మాత్రమే. అక్కడే కథ జరుగుతుంది. కథలో మార్పులు మాత్రం ఉంటాయి. అలాగే హీరోయిన్ గా కాజల్ ని కూడా తెలుగుకే పరిమితం చేసి హిందీకి వేరే ఫ్రెష్ ఫేస్ ని పరిచయం చేసే ఆలోచనలో ఉన్నాను.


Click it and Unblock the Notifications











