మహేష్ 'ది బిజెనెస్ మ్యాన్' పోస్టర్ అంటూ...
మహేష్, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో ది బిజినెస్ మ్యాన్ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అప్పుడే ఈ చిత్రం పోస్టర్స్ అంటూ కొన్ని ఫోటోలు నెట్లో మొదలయ్యాయి. ఈ మధ్య ప్రతీ పెద్ద హీరో సినిమాకు ఈ పోస్టర్స్ తలనొప్పి మొదలైంది. ఫస్ట్ లుక్ అంటూ వదులుతున్న ఈ పోస్టర్స్ ఇంప్రెసివ్ గానే ఉంటున్నాయి. ఆ తర్వాత దర్శక,నిర్మాతలు వాటినే ఫైనలైజ్ చేస్తున్నారు కూడా ఇదే పద్దతిలో ఈ సినిమాకు కూడా జేమ్స్ బాండ్ చిత్రం కాసినో రాయల్ పోస్టర్ ని అనుకరిస్తూ పోస్టర్ ని వదిలారు. ఇక ఈ చిత్రం ముంబై మాఫియాకి చెందిన కథగా తెరకెక్కుతోంది. 'బిజినెస్‌మ్యాన్'గా టైటిల్‌కు తగిన పాత్ర అది. పోకిరి తర్వాత అంతటి హిట్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాం అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్.
ఆర్.ఆర్.మూవీస్ పతాకంపై ఆయన రూపొందించబోయే చిత్రం గురించి మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. రీసెంట్ గానే ఈ చిత్రం ఓపినింగ్ జరిగింది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని అందివ్వాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.అలాగే ఈ చిత్రంలో తొలిసారిగా కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, కళ: చిన్నా, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు- దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











