అప్పుడేమో కోహినూర్ డైమండ్..ఇప్పుడేమో రాక్షసి...
'పోకిరి" సినిమాలో ఇలియానాను రోడ్డుమీద నడిచొస్తున్న కోహినూర్ వజ్రంతో పోల్చారు పూరి జగన్నాథ్. ఇప్పుడేమో… 'రాక్షసి" అంటున్నారు. అప్పటి కోహినూర్ డైమండ్ ఉన్నంటుండి రాక్షసి ఎలా అయ్యిందని అడిగితే… 'ఈ రాక్షసి అలాంటి ఇలాంటి రాక్షసి కాదు… అందాల రాక్షసి. కథానాయకుడు రాణా మనసును పీల్చి పిప్పి చేసిన ఈ రాక్షసి గురించి తెలుసుకోవాలంటే, ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే…" అంటున్నారాయన. ఇలియానాను ఇప్పుడు అందరూ అందాల 'రాక్షసి" అని పిలుస్తున్నారంట. అయితే ఇదేదో ఆమె నిక్‌నేమ్ అనుకోండి. ఇలు (ఇలియానా ముద్దుపేరు) నటించిన తాజా చిత్రం 'నేను నా రాక్షసి" చిత్రంలో ఆమె టైటిల్ పాత్రను పోషిస్తున్నారు. అందుకనే ఆ పేరు.
రాణా హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'నేను నా రాక్షసి". ఇలియానా ఈ చిత్రంలో కథానాయిక. బేబి భవ్య సమర్పణలో లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్నారు. ఏప్రిల్ చివరి వారంలో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ 'భిన్న కథాంశంతో రూపొందుతున్న లవ్ థ్రిల్లర్ ఇది. అన్ని వర్గాలను అలరించేలా తెరకెక్కింది. నాకెంతో ఇష్టమైన సబ్జెక్టుతో తీసిన కమర్షియల్ చిత్రమిది" అన్నారు. నిర్మాత మాట్లాడుతూ 'పూరితో మా బేనర్‌లో తొలి సినిమా. రాణా-ఇలియానా జోడీ హైలైట్. ఇలియానా అందాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.


Click it and Unblock the Notifications











