రాణా తో అనుష్క-డైరెక్టర్ మధ్య కెమిస్ట్రీ మరోసారి బట్టబయలు..!?
డైరెక్టర్ క్రిష్ సెక్సీ స్వీటీ అనుష్కల మధ్య ప్రేమాయణం సాగుతోందని ఎన్నాళ్లగానో టాలీవుడ్ సినీజనం ఒకటే గుసగుసలు. తర్వాత అనుష్క త్వరలోనే పెళ్లి చేసుకుంటానని ప్రకటించిన తర్వాత సినీ పరిశ్రమలో పలువురు ఆమె పెళ్లి దర్శకుడు క్రిష్ తోనే అని ప్రచారం మొదలెట్టాశారు. అయితే పెళ్లి మాటేమో కానీ ప్రస్తుతానికి క్రిష్ కి అనుష్క తప్ప మరే హీరోయిన్ కథానాయికగా అనిపించడం లేదేమో...ఇటీవల అనుష్క కోలీవుడ్ అవకాశాలతో బిజీ అయిపోవడంతో టాలీవుడ్ కు దూరమైంది. దీంతోపాటే ఆమెపై రూమర్లు కూడా వెనక్కిపోయాయి.
ఇపుడు మళ్లీ డైరెక్టర్ క్రిష్ - అనుష్క ప్రేమాయణం జరుగుతూనే ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రానా దగ్గుబాటి హీరోగా క్రిష్ణం వందేజగద్గురుం చిత్రంలో అనుష్కను నటింపజేసేందుకు క్రిష్ సంప్రదిస్తే అనుష్క వెనుకా ముందు ఆలోచించకుండా ఓకే చెప్పేసిందట. రాణా కంటే దాదాపు ఆరేడేళ్లు పెద్దదైన అనుష్క పెద్దగానే కపినిపిస్తుంది. అయినా కూడా కేవలం హైట్ మ్యాచ్ అయిందని ఇద్దరినీ పెట్టి సినిమా తీయడానికి క్రిష్ అంగీకరించాడని సమాచారం. దీంతో మళ్లీ వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఏమాత్రం తగ్గలేదనీ, ఏదో ఒకరోజు ఇద్దరూ ఏదో కబురు చెపుతారని అంటున్నారు టాలీవుడ్ సినీజనం.


Click it and Unblock the Notifications











