అనిరూధ్ దెబ్బకు.. 'దేవర'పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ టెన్షన్ టెన్షన్.. అయినా అలా చేశాడేంటి?
ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ ఏకంగా శంకర్ తో సినిమా చేస్తుంటే... ఎన్టీఆర్ కూడా ఒక సాలిడ్ ప్రాజెక్ట్ లైన్ లో పెట్టాడు. కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే తాజాగా ఈ సినిమా యూనిట్ మరింత జాగ్రత్త పడుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...
శరవేగంగా దేవర: ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా... సైఫ్ అలీఖాన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే పలువురు ఇతర భాషలకు చెందిన నటీనటులను కూడా సినిమాలో భాగమయ్యేలా చేస్తున్నారు. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఈ సినిమాకి తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్ర సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

దేవర టీమ్ మీద ప్రెజర్: అయితే ఇప్పుడు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ విషయంలో దేవర టీమ్ మీద గట్టి ప్రెషర్ పడినట్లుగా తెలుస్తోంది. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న లియో సినిమాతో పాటు జైలర్ సినిమా సాంగ్స్ తమిళ ప్రేక్షకులను అలాగే తెలుగు ప్రేక్షకులను సైతం పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఆ ప్రెజర్ దేవర టీమ్ మీద పడినట్లుగా తెలుస్తోంది.
అభిమానుల టెన్షన్: ఈ మధ్యనే లియో సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్... అలాగే జైలర్ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగల్ కూడా రిలీజ్ అయ్యాయి. ఇంటర్నెట్ లోనే కాదు ఫ్యాన్స్ లో కూడా ఈ పాటలు పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాయని చెప్పక తప్పదు. ఇక అనిరుద్ రవిచంద్ర మ్యూజిక్ ఇలా ఉండడంతో ఎన్టీఆర్ అభిమానులు అందరూ టెన్షన్ పడుతున్నారు.

మ్యూజిక్ విషయంలో కాంప్రమైజ్: ఆయన మ్యూజిక్ బాలేదు కదా ఇప్పుడు కొరటాల శివ సినిమాకి ఆయనతో మ్యూజిక్ ఎందుకు ఇప్పిస్తున్నారని వారంతా సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తమ్ముల్లాగా అనిరుద్ రవిచంద్ర మీద కాపీ మరకలు ఉండవు అలాగే లేటుగా ఇస్తాడన్న అపవాది కూడా లేదు కానీ ఆయన మీద వరుస సినిమాలో ప్రజలు పడుతూ ఉండడంతో మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అయిందన్న చందాన ఆయన ఏమైనా మ్యూజిక్ విషయంలో కాంప్రమైజ్ అవుతున్నాడా అనే చర్చ జరుగుతోంది.

కొరటాల జాగ్రత్తలు: అందుకే గతంలో బ్లాక్ పోస్టర్ సాంగ్స్ ఇచ్చినా సరే ఇప్పుడు ఏమాత్రం గుర్తింపు తగ్గ సాంగ్స్ ఇవ్వలేకపోతున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే కొరటాల శివ మాత్రం ఈ విషయంలో ఏమాత్రం ప్రెజర్ తీసుకోవడం లేదని సాంగ్ మీద ఏ మాత్రం నమ్మకం లేకపోయినా ఆయన వెంటనే దాన్ని రిజెక్ట్ చేయడం ఖాయమని ఎన్టీఆర్ అభిమానులు అయితే నమ్ముతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆచార్య విషయంలో చాలా ఇబ్బంది పడిన కొరటాల శివ ఈ దేవర సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











