పదిహేనేళ్ల తర్వాత కలిసిన గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్స్ కోటి- రాజ్
ఒకప్పుడు తెలుగు సినిమా సంగీత ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసిన సంగీత దర్శకద్వయం రాజ్-కోటి. ఏ సినిమా చూసినా వీరిదే సంగీతం. ఏ హీరో చూసినా వీళ్లనే రికమెండ్ చేసేవాడు. ఓపక్క చక్రవర్తి... మరోపక్క కెవి మహదేవన్, సంగీతం చక్రవర్తి మరియు ఇళయరాజా ఫామ్ లో ఉన్నప్పటికీ, తమ టాలెంట్ తో అస్తిత్వాన్ని కాపాడుకున్నారు రాజ్-కోటి. ఇద్దరూ కలిసి ఏడాదికి పాతిక సినిమాలు కూడా చేసిన సందర్భాలున్నాయి. అయితే, ఉన్నట్టుండి ఇద్దరిలోనూ ఇగో సమస్య తలెత్తడంతో పదిహేనేళ్ల క్రితం విడిపోయారు. దాంతో వాళ్ల ప్రాభవం కూడా మెల్లిగా తగ్గిపోయింది. కోటి కాస్త నెట్టుకొచ్చినా, రాజ్ మాత్రం పూర్తిగా కనుమరుగైపోయాడు.
మధ్యలో ఇద్దర్నీ కలపాలని చాలా మంది ప్రయత్నించినప్పటికీ పగిలిన అద్దం అతుక్కోదన్నట్టు ఇద్దరూ కలవలేకపోయారు. అయితే, మళ్లీ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత, ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ చొరవతో రెండు రోజుల క్రితం ఇద్దరూ చెన్నయ్ లో ఒకే వేదికపై సన్మానం అందుకున్నారు. ఈ సందర్భంగా అందరి కోరికపై మళ్లీ ఇద్దరూ కలిసి పనిచేయడానికి నిర్ణయించుకుని ఒక్కటయ్యారు. నిజంగా ఇది ఆనందించదగ్గా, ఆహ్వానించదగ్గా పరిణామం. వీరిద్దరూ కలిసి తాజాగా 'సాక్షి' టీవీ లో లైవ్ కూడా చేస్తున్నారిప్పుడు. మళ్లీ ఇద్దరి కలయికలో మంచి సంగీతం రావాలని కోరుకుందాం.!


Click it and Unblock the Notifications











