twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇండస్ట్రీలో నెగిటివిటీ వ్యాప్తి చేస్తున్నారు... స్టార్ హీరో, విజయ్ దేవరకొండ పేరు అడ్డంపెట్టుకుని!

    |

    ఓ వైపు ఇండస్ట్రీని ఏలుతున్న స్టార్ హీరోలు, మరో వైపు గట్టి పోటీ ఇస్తున్న వారసులు... వీరి మధ్య ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా, ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేకుండా కేవలం టాలెంటుతో పైకి రావడం అంటే మామూలు విషయం కాదు. అఫ్ కోర్స్ కొందరికి టాలెంట్ ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాదు. ఇవన్నీ ఎవరో ఒకరికి అరుదుగా కలిసి వస్తూ ఉంటాయి. ఇప్పుడున్న హీరోల్లో ఆ ఛాన్స్ కొట్టేసిన స్టార్ ఎవరంటే... ప్రతి ఒక్కరి నోట ముందుగా వచ్చే పేరు విజయ్ దేవరకొండ.

    థియేటర్ ఆర్ట్స్ నేర్చుకుని, సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుటక్టూ చెప్పులు అరిగేలా తిరిగి... కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి, చివరకు ఎలాగో అలా ఓ సినిమాలో హీరోగా నటించే అవకాశం దక్కించుకుని... ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ తక్కువ కాలంలోనే స్టార్ హీరో రేంజికి ఎదిగాడు విజయ్ దేవరకొండ.

    విజయ్ దేవరకొండ

    విజయ్ దేవరకొండ

    ‘ఎవడే సుబ్రహ్మణ్యం'లో సైడ్ హీరో గా చేసిన విజయ్... అందులో తన నటన ద్వారా దర్శక నిర్మాతలను ఆకర్షించాడు. పెళ్లి చూపులు మూవీలో సోలో హీరోగా నటించే అవకాశం దక్కించుకున్నాడు. తొలి మూవీ మంచి విజయం సాధించడంతో... వెంటనే ‘అర్జున్ రెడ్డి' లాంటి కల్ట్ మూవీ చేసే ఛాన్స్ కొట్టేశాడు. అదృష్టం విజయ్‌ను వెంటాడిందో ఏమో? కొందరు స్టార్ హీరోలు రిజక్ట్ చేసిన ఈ కథ చివరకు అతడి వద్దకు రావడం, సినిమా విడుదలైన తర్వాత పెద్ద విజయం సాధించడంతో దేవరకొండ పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది.

    ఆ తరవాత వరుస అవకాశాలు

    ఆ తరవాత వరుస అవకాశాలు

    ‘అర్జున్ రెడ్డి' తర్వాత విజయ్ దేవరకొండ పేరు కేవలం తెలుగులోనే కాదు దేశ వ్యాప్తంగా మారు మ్రోగిపోయింది. ఈ సినిమా ఇతర భాషల్లోనూ రీమేక్ అయింది. దీని తర్వాత చేసిన ‘గీతా గోవిందం' రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరడంతో విజయ్ టాలీవుడ్ మోస్ట్ డిమాండింగ్ స్టార్‌గా మారిపోయాడు. ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకున్నాడు.

    సౌతిండియా వ్యాప్తంగా

    సౌతిండియా వ్యాప్తంగా

    విజయ్ దేవరకొండకు ఇంత క్రేజ్ రావడానికి కారణం కేవలం అతడి యాటిట్యూడ్ అని చెప్పక తప్పదు. ఏ విషయమైనా ఓపెన్‌గా మాట్లాడటం, జెన్యూన్‌ చెప్పే అతడి విధానం, రౌడీ స్టైల్ యువతకు తెగ నచ్చేసింది. అతడి క్రేజ్ ఎంతలా పెరిగిందంటే... కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా సౌతిండియా వ్యాప్తంగా అతడికి అభిమానులు ఏర్పడ్డారు. దేవరకొండ ఫాలోయింగ్ చూసి నిర్మాతలు కూడా ‘డియర్ కామ్రేడ్' చిత్రాన్ని నాలుగు భాషల్లో విడుదల చేశారు.

    ఇండస్ట్రీలో నెగిటివిటీ వ్యాప్తి చేస్తున్నారు...

    ఇండస్ట్రీలో నెగిటివిటీ వ్యాప్తి చేస్తున్నారు...

    కాగా... తాజాగా విజయ్ దేవరకొండ మీద ఓ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ స్టార్ హీరో తన అభిమానులకు విజయ్ దేవరకొండ లాంటి వారిని ఎంకరేజ్ చేయొద్దని సూచించారట. ఈ ప్రచారం ఎలా మొదలైందో తెలియదు కానీ.... సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. కావాలనే కొందరు తమ పబ్బం గడుపుకోవడానికి ఇలాంటి నెగిటివిటీని ఇండస్ట్రీలో వ్యాప్తింప చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

    ఇలాంటి ప్రచారాన్ని నమ్మకుండా ఉండటమే మనకు, మన ఇండస్ట్రీకి మంచిది

    ఇలాంటి ప్రచారాన్ని నమ్మకుండా ఉండటమే మనకు, మన ఇండస్ట్రీకి మంచిది

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో పోటీ వాతావరణం ఉన్న మాట నిజమే కానీ.... అది పూర్తిగా హెల్దీ కాంపిటీషన్. ఒక హీరో ఎదుగుదలను చూసి కుళ్లుకునే స్టార్స్ ఇండస్ట్రీలో ఎవరూ లేరనే చెప్పాలి. మరి ఎవరు ఇలాంటి ప్రచారం తెరపైకి తెచ్చి నెగటివిటీ వ్యాప్తి చేయాలని చూస్తున్నారో అర్థం కావడం లేదు. ఇలాంటి ప్రచారాన్ని నమ్మకుండా ఉండటమే మనకు, మన ఇండస్ట్రీకి మంచిది.

    English summary
    There is a healthy competition among the star heroes in the Telugu film industry. Everyone is very friendly. But some people are spreading the negativity in Telugu cinema industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X