The Paradise: నాని 'ది ప్యారడైజ్'ఐటమ్ సాంగ్‌.. రంగంలోకి స్టార్ హీరోయిన్‌

టాలీవుడ్‌లో మరోసారి భారీ అంచనాలు నెలకొన్న సినిమా ది ప్యారడైజ్ (The Paradise). నేచురల్ స్టార్ నాని హీరోగా, 'దసరా' తో ఇండస్ట్రీని షేక్ చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన అనౌన్స్‌మెంట్ గ్లిమ్స్, పోస్టర్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ముఖ్యంగా నాని డెలివర్ చేసిన రా, రస్టిక్ పంచ్ డైలాగులు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఈ తరుణంలో ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట్లో తెగ వైరలవుతోంది. ఇంతకీ ఆ సంగతేంటీ?

ఇప్పటివరకు ఫ్యామిలీ, క్లాస్ సినిమాలతో ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న నాని.. 'ది ప్యారడైజ్'తో పూర్తిగా మాస్ అవతారంలో కనిపించబోతుండటం విశేషం. 'దసరా' తర్వాత మరోసారి అదే రా రస్టిక్ ప్రపంచాన్ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరపై ఆవిష్కరించబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఈ కాంబినేషన్ మళ్లీ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయనుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

The Paradise Movie Tamannaah Item Song Buzz Sparks Massive Hype for Nani s Upcoming Film

ఈ సినిమాకు మరింత క్రేజ్ తెచ్చింది విలన్ ఎంపికే. చాలాకాలం తర్వాత కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పూర్తి స్థాయి ప్రతినాయక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌లో ఆయన లుక్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా మారింది. గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన 'బుజ్జిగాడు', తాజాగా 'కన్నప్ప' వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించిన మోహన్ బాబు.. ఇప్పుడు నానితో ఢీకొట్టే పవర్‌ఫుల్ విలన్‌గా కనిపించబోతుండటం ఆసక్తిని రేపుతోంది. ఈ పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టి, శారీరకంగా బాగా కష్టపడ్డారని సమాచారం.

ఇక ఓటీటీ రైట్స్ విషయానికి వస్తే.. షూటింగ్ పూర్తికాకముందే భారీ డీల్ క్లోజ్ అయినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ముందుగానే భారీ మొత్తం చెల్లించి రిలీజ్ డెడ్‌లైన్ కూడా ఫిక్స్ చేసిందట. అందుకే సినిమా పనులు మరింత వేగంగా జరుగుతున్నాయని సమాచారం. ఈ సినిమా 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇక తాజాగా ఈ మూవీపై సోషల్ మీడియాలో మరో హాట్ టాపిక్ నడుస్తోంది. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఈ సినిమాలో స్పెషల్ ఐటెమ్ సాంగ్‌లో మెరవబోతున్నారనే వార్త హల్‌చల్ చేస్తోంది. ఆమె మళ్లీ ఐటెం సాంగ్ లో కనిపించబోతుండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ఈ సాంగ్‌లో నాని కూడా తమన్నాతో కలిసి స్టెప్స్ వేయనున్నాడని, ఇది పూర్తిగా ఊర మాస్ స్టైల్‌లో ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది.

'బాహుబలి', 'ఎఫ్2', 'భోళా శంకర్' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో పాటు, 'అయాన్', 'సిరుతై' వంటి తమిళ చిత్రాల్లో డాన్స్‌తో ప్రేక్షకులను మెప్పించిన తమన్నా.. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు, బాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఒకవేళ ఈ ఐటెమ్ సాంగ్ నిజమైతే, నాని-తమన్నా కాంబినేషన్ తెరపై కొత్త మ్యాజిక్ సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. మొత్తానికి స్ట్రాంగ్ కాస్ట్, రా మాస్ ట్రీట్మెంట్, నాని డెడికేషన్, శ్రీకాంత్ ఓదెల విజన్ అన్ని కలిపి 'ది ప్యారడైజ్' టాలీవుడ్‌లో మరో బిగ్ ఈవెంట్‌గా మారబోతోందని స్పష్టంగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ మూవీకి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా ట్రెండ్ అవుతుండటం ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌కు నిదర్శనం.

More from Filmibeat

Read more about: tamannaah bhatia nani Paradise
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X