నాని ‘ది ప్యారడైజ్'మళ్లీ వాయిదా పడుతుందా? అలా జరిగితే కోట్లలో నష్టం!

నేచురల్ స్టార్ నాని హీరోగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా 'ది ప్యారడైజ్'(The Paradise). 'దసరా'తో సంచలన విజయం అందుకున్న ఈ కాంబో మళ్లీ రిపీట్ కావడం,ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు, కాన్సెప్ట్ వీడియోలతో దేశవ్యాప్తంగా భారీ అంచనాలు సృష్టిస్తున్నాయి. అయితే.. ఈ సినిమా ఆగస్టు 21న విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. కానీ, మరోసారి వాయిదా పడే అవకాశాలున్నాయనే వార్తలు మాత్రం అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అసలేం జరిగింది. ఇంతకీ డిలేకు కారణమేంటీ?

ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, కయాదు లోహార్, రాఘవ్ జుయల్, సోనాలి కుల్కర్ణి, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. 'దసరా' తర్వాత శ్రీకాంత్ ఓదెలపై ఏర్పడిన అంచనాలు, నానిని పూర్తిగా కొత్త అవతారంలో చూపించాలనే ప్రయత్నం కారణంగా ప్రతి సన్నివేశాన్ని అత్యంత జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 'జాడల్' అనే పాత్రలో నాని ఇప్పటివరకు కనిపించని రగ్గడ్, వైల్డ్ లుక్‌లో కనిపించనున్నాడనే వార్తలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి.

The Paradise Release Delay

సినీ వర్గాల తాజా సమాచారం ప్రకారం.. 'ది ప్యారడైజ్'షూటింగ్ ఇంకా పూర్తికాలేదని తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని కీలక యాక్షన్ ఎపిసోడ్లు, భారీ స్థాయి సన్నివేశాలు ఇంకా షూటింగ్ చేయాల్సి ఉందని ప్రచారం జరుగుతోంది. సాధారణంగా నాని సినిమాలు ముందస్తు ప్రణాళిక ప్రకారం వేగంగా పూర్తవుతుంటాయి. కానీ 'ది ప్యారడైజ్' విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఒకసారి విడుదల వాయిదా పడిన ఈ సినిమా మళ్లీ ఆలస్యం అయ్యే అవకాశాలపై సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది.

మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫిక్స్ (Netflix)భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ఒప్పందంలో విడుదల తేదీకి సంబంధించిన ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని సమాచారం. మేకర్స్ ప్రకటించిన తేదీకే సినిమా విడుదల కావాల్సి ఉంటుందని, ఒకవేళ మరోసారి వాయిదా పడితే ఇప్పటికే కుదిరిన ఒప్పందంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనివల్ల డిజిటల్ డీల్ విలువపై కూడా ప్రభావం పడొచ్చనే చర్చ జరుగుతోంది. ఇదే కారణంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి షూటింగ్ పనులను వేగవంతం చేసినట్లు సమాచారం.

ప్రతి షెడ్యూల్‌ను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తూ, ఎలాంటి ఆలస్యం జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారట. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా సమాంతరంగా నిర్వహిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సినిమా ఔట్‌పుట్ విషయంలో దర్శకుడు ఎలాంటి రాజీ పడడం లేదని సమాచారం. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాలనే లక్ష్యంతో యాక్షన్ సన్నివేశాలు, విజువల్ ట్రీట్ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. నార్త్ ఇండియా ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా కథను తీర్చిదిద్దుతున్నారని, అందుకే నిర్మాణ పనులు ఊహించిన దానికంటే ఎక్కువ సమయం తీసుకుంటున్నాయని తెలుస్తోంది.ః

ఇదిలా ఉంటే.. తాజాగా మేకర్స్ జడల్ జామానా(JadalZamana) అంటూ ప్రత్యేక పోస్టర్ విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రం 6:03 గంటలకు ఓ కీలక అప్‌డేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో అభిమానులు ఆ అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ అప్‌డేట్‌లో కొత్త రిలీజ్ డేట్ ఉంటుందా? లేక ఆగస్టు 21 విడుదలపై స్పష్టత ఇస్తారా? అనే చర్చలు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. మొత్తంగా 'ది ప్యారడైజ్'పై భారీ అంచనాలు, మరోవైపు షూటింగ్ ఆలస్యం, నెట్‌ఫ్లిక్స్ డీల్‌కు సంబంధించిన ప్రచారం.. ఇవన్నీ కలిసి సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచుతున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో, సినిమా నిజంగా ఆగస్టు 21న విడుదలవుతుందో లేదో తెలుసుకోవాలంటే మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.

Read more about: The Paradise nani srikanth odela
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X