ఆ వ్యక్తి వల్లే మెగా ఫ్యామిలీలో విభేదాలు .. పుల్లలు పెడుతూ , అల్లు అర్జున్ అందుకే దూరం?

ఏ కుటుంబమైనా సంతోషంగా జీవించడానికి ఐకమత్యం ముఖ్యం. అందుకే మన పెద్దలు ఐకమత్యమే మహాబలం అని చెప్పారు. మరీ ముఖ్యంగా సమాజం అభ్యున్నతి సాధించడానికి ఉమ్మడి కుటుంబ వ్యవస్ధను తీసుకొచ్చారు. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్న నేటీ కాలంలోనూ మనకు అక్కడక్కడా ఉమ్మడి కుటుంబాలు కనిపిస్తాయి. కానీ చెప్పుడు మాటలు , అహంకారం , ఓపిక లేకపోవడం వంటి బలహీనతలు ఎంత పెద్ద కుటుంబాన్నైనా ముక్కలు చేస్తాయి.

తెలుగు చిత్ర పరిశ్రమలో తొలి నుంచి మెగా హీరోలది , కుటుంబానికి ఒకే మాట ఒకే బాట. కుటుంబంలో కానీ, సినిమా విషయాలలో కానీ మెగా ఫ్యామిలీ అంతా ఎప్పడూ ఏకతాటిపైకి వచ్చి నిలిచేది . తమలో ఏ ఒక్కరికి కష్టం కలిగినా ఒకరికొకరు తోడుగా నిలిచేవారు. అయితే గత కొన్నాళ్లుగా ఈ కుటుంబం పైకి కనిపిస్తున్నట్లుగా లేదని లోపల ఒకరికొకరు పడటం లేదంటూ ఫిలింనగర్‌లో ఎప్పటి నుంచో చక్కర్లు కొడుతోంది. దీనంతటికీ కారణం ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ అంటూ ఆయన వైపు వేళ్లు చూపిస్తున్నాయి.

the person behind the mega family vs allu family clashes

మెగా ఫ్యామిలీలో అల్లు ఫ్యామిలీ వేరని , తనకు మెగా బ్రాండ్ వద్దన్నట్లుగా ఆయన వ్యవహారశైలి ఉంటోందని మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కారాలు మిరియాలు నూరుతున్నారు. చెప్పను బ్రదర్ ఇన్సిడెంట్‌తో మొదలుపెట్టి నిన్న మొన్నటి ఏపీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధికి ప్రచారం వరకు బన్నీ చేసిన చర్యలు మెగా ఫ్యామిలీకి ఆగ్రహం తెప్పించాయని అంటారు. ఇప్పటి వరకు చూసీ చూడనట్లుగా వదిలేసినప్పటికీ.. వైసీపీ అభ్యర్ధికి ప్రచారాన్ని మాత్రం మెగా పెద్దలు సీరియస్‌గా తీసుకున్నట్లుగా ఫిలింనగర్‌లో చర్చించుకుంటున్నారు. అల్లు అర్జున్‌పై నాగబాబు ట్వీట్, బన్నీ దంపతులను సాయిథరమ్ తేజ్ సోషల్ మీడియాలో బ్లాక్ చేయడం .. ఈ పరిణామాలు చూస్తుంటే మెగా ఫ్యామిలీలో ఏదో జరుగుతోందని అంటున్నారు.

అయితే నేటికీ ఈ గొడవకి ఫుల్‌స్టాప్ పడకపోగా .. రోజు రోజుకి మరింత తీవ్రమవుతోంది. అల్లు అర్జున్ మెగా కాంపౌండ్‌లో కనిపించడం లేదు. ఆఖరికి నిన్న పుష్ప టీమ్ మొత్తం చిరంజీవిని కలవగా.. హీరో అయ్యుండి బన్నీ డుమ్మా కొట్టాడు. ఈ పరిణామాలు అభిమానులకు తప్పుడు సంకేతాలను పంపుతున్నాయి. అయితే ఈ గొడవలన్నీంటికీ కారణం మెగా బ్రదర్ నాగబాబు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మెగా బ్రదర్స్‌ని ఎవరైనా పల్లెత్తు మాట అన్నా వాళ్లని చెడుగుడు ఆడుకుంటారు నాగబాబు.

ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లిన ఘటనపై పోలింగ్ జరిగే వరకు ఓపిక పట్టిన ఆయన ఆ వెంటనే మనోడు, పరాయి వాడు అంటూ వదిలిన ట్వీట్ కలకలం రేపింది. దీనికి కౌంటర్‌గా అల్లు ఆర్మీ రెచ్చిపోవడంతో నాగబాబు ఏకంగా ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేశారు. తర్వాత మెగా పెద్దలు రంగంలోకి దిగడంతో కొన్నాళ్లు వ్యవహారం సద్దుమణిగింది. మెగా ఫ్యామిలీలో చీలికలపై ఓ ఛానెల్‌లో ప్రసారమైన కార్యక్రమంలో ఓ నిపుణురాలు కూడా మెగా ఫ్యామిలీలో గొడవలకి నాగబాబే కారణమని చెప్పారు. అన్నదమ్ములిద్దరూ ఉన్నత శిఖరాలకు చేరుకోగా.. ఆయన పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నారని ఆమె అన్నారు.

చిరంజీవి అతనిని కంట్రోల్ చేయకుంటే గొడవలు ఇలాగే కంటిన్యూ అవుతాయని ఆ నిపుణురాలు ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని విషయాలను పట్టుకోవాలి, కొన్ని విషయాలను వదిలేయాలని అలా కాకుండా సాగదీస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: mega family allu family nagababu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X